ఆ హీరోయిన్ తో ప్రేమాయణం అంటూ మెగా అల్లుడుపై రూమర్?

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరితో ప్రేమలో పడతారో ఎవరు విడాకులు తీసుకుంటారో తెలియడం లేదు.

ఈ క్రమంలోనే ఎంతో అన్యోన్యంగా ఉన్న కొన్ని జంటలు ఉన్నఫలంగా విడాకులు తీసుకొని విడిపోతున్నట్లు ప్రకటిస్తున్నారు.

ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా ఉన్నటువంటి సమంత నాగచైతన్య దంపతులు విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు.

ఈ ప్రకటన కేవలం దక్షిణాది రాష్ట్రాలలో మాత్రమే కాకుండా ఉత్తరాది రాష్ట్రాలలో కూడా సంచలనంగా మారింది.

అదే విధంగా కోలీవుడ్ స్టార్ కపుల్స్ ఐశ్వర్య ధనుష్ సైతం విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించారు.

ఇలా సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ మంది సెలబ్రిటీలు విడాకులు తీసుకుని ఉండగా టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిన్న కూతురు శ్రీజ కూడా తన భర్త కళ్యాణ్ దేవ్ తో విడాకులు తీసుకోవడానికి సిద్ధమైనట్లు గత కొద్ది రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి.

శ్రీజ ఉన్నఫలంగా తన సోషల్ మీడియా ఖాతాలలో కళ్యాణ్ పేరును తొలగించడమే కాకుండా కళ్యాణ్ కూడా గత కొద్దిరోజుల నుంచి మెగా కుటుంబానికి దూరంగా ఉండటం వల్ల అనుమానాలు మరింత పెరిగాయి.

"""/"/ అయితే తాజాగా కళ్యాణ్ గురించి సోషల్ మీడియాలో ఒక వార్త హల్ చల్ చేస్తోంది.

కళ్యాణ్ దేవ్ శ్రీజ దూరంగా ఉండడానికి గల కారణం మరొక హీరోయిన్ అని తెలుస్తోంది.

కళ్యాణ్ దేవ్ మెగా కుటుంబం అండతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు.ఈ క్రమంలోనే హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన కళ్యాణ్ మరొక హీరోయిన్ తోప్రేమాయణం కొనసాగిస్తున్నారని అందువల్లే శ్రీజ తనకు దూరంగా ఉంటూ విడాకులు ఇవ్వడానికి కూడా సిద్ధమైందని వార్తలు వినపడుతున్నాయి.

మరి ఈ విషయంలో ఎంత వరకు నిజముందో తెలియాలంటే ఈ విషయం పై మెగా కుటుంబం స్పందించాల్సి ఉంది.

ఒక పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేస్తే తొక్కేస్తారా.. గెటప్ శ్రీను షాకింగ్ కామెంట్స్ వైరల్!