రంజాన్ ఉపవాసం చేసేవారు ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలివే?

పండుగ అనేది ప్రతి ఒక్కరికి ఎంతో ప్రత్యేకమైనది.అది హిందువులైన, క్రైస్తవులైన, ముస్లిం లైన ప్రతి పండుగ వెనుక ఎంతో అర్థం పరమార్థం దాగి ఉంటుంది.

ఈ క్రమంలోనే క్రైస్తవులకు క్రిస్మస్ ముఖ్యమైన పండుగగా హిందువులకు ఉగాది, దసరా, సంక్రాంతి వంటివి ఎంతో ముఖ్యమైన పండుగలు.

ఇకపోతే ముస్లింలకు రంజాన్ పండుగ ఎంతో ప్రత్యేకమైనది.రంజాన్ పండుగ సైతం మానవాళికి హితాన్ని అందిస్తుంది.

ముస్లింలు చాంద్రమానాన్ని అనుసరించే ఇస్లామీయ కేలండర్ తొమ్మిదవ నెల రంజాన్ ని జరుపుకుంటారు.

ముస్లింలు ఈ విధంగా చంద్ర మానాన్ని అనుసరించి పండుగ జరుపుకోవడానికి గల కారణం ఆ మాసంలోని ముస్లింల పవిత్ర గ్రంధమైన ఖురాన్ ఆవిష్కరించబడింది.

కనుక ఈ నెలలో రంజాన్ పండుగను ఎంతో వేడుకగా జరుపుకుంటారు.ఖురాన్ లో రంజాన్ నెలలో విధిగా ఆచరించవలసిన నియమం "ఉపవాస వ్రతం".

ముస్లింలందరూ ఈ నెల మొత్తం ఎంతో కఠినమైన ఉపవాసము చేస్తారు.ఈ విధమైన ఉపవాసం పాటిస్తున్న వారు ముఖ్యంగా తీసుకోవాల్సిన నియమాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

* ముస్లిం మతస్థులు ఉపవాస సమయంలో ఎలాంటి పరిస్థితులలో కూడా వారి నోటి నుంచి చెడు మాటలు పలక కూడదు.

అదేవిధంగా చెడు మాటలను వినకూడదు.* ఉపవాసం చేసేవారు వారి దృష్టి మొత్తం ఆ భగవంతుడు పై ఉంచాలి.

ఎలాంటి పరిస్థితులలో కూడా తన దృష్టిని చెడు కార్యాల వైపు వెళ్లకుండా జాగ్రత్త పడాలి.

* ఉపవాసం చేసేవారు తన శరీర భాగాలన్నింటిని చెడు పనుల నుంచి దూరంగా ఉంచుకోవాలి.

అక్రమంగా సంపాదించి ఆ డబ్బుతో ఇఫ్తార్ విందులను ఇవ్వకూడదు.* అబద్దాలు చెప్పడం, చాడీలు చెప్పడం,అనవసర కబుర్లతో కాలయాపన, నోటిదురుసు లాంటివన్నీ ఉపవాస స్ఫూర్తికి విరుద్ధం.

ముఖ్యంగా పరోక్ష నింద వల్ల ఉపవాసం భంగమవుతుంది.* ఉపవాసం చేసేవారు వారు చేసే ఉపవాసానికి ఫలితం అందుతుందో లేదో అనే ఆందోళన ఉండటం వల్ల రోజు ఉపవాస వ్రతాన్ని చక్కగా నిర్వర్తించేలా చేస్తాయి.

అంబానీ నుంచి జయలలిత వరకు గొప్పగా పెళ్లిళ్లు చేసి కష్టాలు కొనితెచ్చుకున్నారు