ప్రజా సమస్యల పరిష్కారంలో పాలకులు విఫలమయ్యారు: పారేపల్లి శేఖర్ రావు
TeluguStop.com
సూర్యాపేట జిల్లా:గరిడేపల్లి మండల కేంద్రంలో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారంలో పాలకులు పూర్తిగా విఫలమయ్యారని సీపీఎం నేత పారేపళ్లి శేఖర్ రావు( Parepalli Shekhar Rao )అన్నారు.
బుధవారం గరిడేపల్లిలో జరిగిన సిపిఎం జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కుల మతాల పేరుతో బీజేపీ ప్రజలను విచ్ఛిన్నం చేస్తుందని,ఇలాంటి మతవాద రాజకీయాలు ప్రజల్లో చాలా కాలం నిలవని కర్ణాటక ప్రజలు గుర్తు చేశారని అన్నారు.
ప్రజలకు ద్రోహం చేసిన ప్రభుత్వాలు,నిరుద్యోగ సమస్య( Unemployment ) పరిష్కరించని పాలకులు ప్రజల్లో ఉండరన్నారు.
కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ ప్రభుత్వ ఆస్తుల్ని అప్పనంగా అమ్ముతున్నారని, కాంట్రాక్టర్లు చేతుల్లో దేశాన్ని పెట్టారని,దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని, ఇది ఎర్రజెండాకే సాధ్యపడుతుందన్నారు.
రాబోవు రోజుల్లో ఎర్రజెండా రాజ్యం వస్తుందని రైతాంగానికి( Farmers ) సబ్సిడీలు మొత్తం ఎత్తివేసి కార్పొరేట్ శక్తులకు వేల కోట్ల రూపాయలు మాఫీ చేస్తూ 2000 రూపాయలని రద్దు చేస్తూ ఎందుకు తెచ్చారని ప్రశ్నించారు.
ఈ నోట్లు ఎందుకు రద్దు చేస్తున్నారో ప్రజలకు వివరించాలని, పేదవాడికి 17 లక్షలు ఇస్తానని చెప్పి చివరికి ప్రజల నేతల శఠగోపం పెట్టారని,ఆదాని, అంబానీల చేతుల్లో కీలుబొమ్మగా తయారైందన్నారు.
రాబోవు రోజుల్లో పోరాటం చేసి ఈ ప్రభుత్వాలను ప్రజా కోర్టులో దోషిగా నిలబెడతామన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి మీసాల మట్టయ్య,పటాన్ మహబూబలి,వెంకటేశ్వర్లు, దోసపాటి భిక్షం,బొమ్మ కంటి అంకయ్య,అంబటి భిక్షం,యనాల సోమయ్య, పి.
అనిమల్ మూవీ నటుడిని కొత్తగా చూపించబోతున్న అనిల్ రావిపూడి…