యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసిన రుక్సర్ ధిల్లాన్..!
TeluguStop.com
విశ్వక్ సేన్ తో అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాలో హీరోయిన్ గా నటించింది రుక్సర్ ధిల్లాన్.
నానితో కృష్ణార్జున యుద్ధం.అల్లు శిరీష్ తో ఏబిసిడి సినిమాలో కూడా నటించిది రుక్సర్ ధిల్లాన్.
అందం అభినయం రెండు ఉన్నా సరే అమ్మడికి లక్ కలిసి రావట్లేదు.
ఈ క్రమంలో విశ్వక్ సేన్ తో చేస్తున్న సినిమాతో అమ్మడు లక్ టెస్ట్ చేసుకుంటుంది.
ఈ సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ గా< ఉంది రుక్సర్ ధిల్లాన్.ఓ పక్క హీరోయిన్ గా చేస్తూనే సొంతంగా యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసింది రుక్సర్ ధిల్లాన్.
ఈమధ్య హీరోయిన్స్ అంతా తమకున్న క్రేజ్ ని వాడుకునేందుకు సొంతంగా యూట్యూబ్ ఛానెల్స్ పెట్టేస్తున్నారు.
ఇప్పటికే స్టార్ హీరోయిన్స్ రష్మిక, కీర్తి సురేష్ సొంత యూట్యూబ్ ఛానెల్స్ పెట్టుకోగా లేటెస్ట్ గా నిత్యా మీనన్ కూడా నిత్యా అన్ ఫిల్టర్డ్ అంటూ ఓ ఛానెల్ స్టార్ట్ చేసింది.
ఇక వారి దారిలోనే రుక్సర్ ధిల్లన్కూ డా ఓన్ గా ఓ యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసింది.
తన రెగ్యులర్ అప్డేట్స్ తో పాటుగా ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ ని అలరించేందుకు వెరైటీగా చేయాలని చూస్తుంది రుక్సర్ ధిల్లాన్.