నేరేడుచర్లలో ప్రారంభమైన రగ్బీ టోర్నమెంట్

సూర్యాపేట జిల్లా:తెలంగాణ మూడవ అంతరాష్ట్రీయ రగ్బీ టోర్నమెంట్ ను ఆదివారం హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా రగ్బీ క్రీడా జట్లు మార్చ్ ఫాస్ట్ పెరేడ్ సెల్యూట్ చేసి ఆయనకు ఘన స్వాగతం పలికారు.

ఈ మార్చ్ ఫాస్ట్ తో క్రీడా మైదానం అంత స్పోర్ట్స్ ఫీవర్ తో మారుమ్రోగిపోయింది.

ఈ టోర్నమెంట్ కు రగ్బీ క్రీడకు సంబంధించి అండర్ 18 బాలుర,బాలికల టీంలు హాజరయ్యాయి.

ఆయా జిల్లాల క్రీడాకారులు వారి వారి జిల్లా స్పోర్ట్స్ యూనిఫామ్ తో మైదానంలో ఎంతో కలర్ ఫుల్ గా పవర్ ఫుల్ గా కనిపించి కనువిందు చేశారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజంలో ఆటల గురించి అందరికి తెలుసు కానీ,రగ్బీ గురించి పెద్దగా తెలియదని అన్నారు.

కానీ,మన రాష్ట్రంలో రగ్బీ గురించి తెలియజేసి,ఇన్ని జిల్లాల టీంలను తయారు చేసిన తరుణ్ కి అభినందనలు తెలిపారు.

ఆటల్లో అండర్ -18 పార్టీసీపీషన్ సర్టిఫికెట్స్ మీద అంతర్జాతీయంగా చాలా విలువ ఉందని,ఇతర దేశాలలో రగ్బీ మీద చాలా టోర్నమెంట్స్ ఐపీఎల్ లాగా నిర్వహిస్తుంటారని, దీనికి చాలా స్కోప్ ఉందని,తొందరగా రాణించడానికి అవకాశాలున్నాయని అన్నారు.

తాము నిర్వహిస్తున్న సై యూత్ కి ప్రేరణ కూడా రగ్బీ గేమ్ అని తెలిపారు.

క్రీడల వలన జీవితంలో మంచి క్రమశిక్షణ, విశాల దృక్పధం,శారీరక దారుఢ్యం,మానసిక ఉల్లాసంతో పాటు మానసిక పరిపక్వత కలుగుతుందన్నారు.

నేరేడుచర్లలో 3 రోజులు పాటు 3 వ,తెలంగాణ రగ్బీ క్రీడా టోర్నమెంట్స్ నిర్వహించడం చాలా సంతోషకరమని అన్నారు.

అనంతరం మొదటగా జరిగే సూర్యాపేట,నల్లగొండ జిల్లాల రగ్బీ గేమ్ ని ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో 29 జిల్లాల రగ్బీ టీం కోచ్ లు,క్రీడా నిర్వాహకులు,29 జిల్లాలకు చెందిన టీం లు,ప్రజాప్రతినిధులు,పార్టీ నాయకులు,యువకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

భారతీయుడు 2 లో కమలహాసన్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారా..?