ఖమ్మంలో మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన -- ఆర్టీసీ ఎం.ఈ.ప్రభులత గారు
TeluguStop.com
సమాజంలోని అన్ని దానాల్లో కెల్లా ఉత్తమమైన దానం రక్తదానం మాత్రమే అని, రక్తదాతలందరూ ప్రాణదాతలేనని వారందరూ గౌరవప్రదమైన పనిచేస్తున్నట్లేనని ఆర్టీసీ ఖమ్మం రీజినల్ మేనేజర్ శ్రీమతి ఎం.
ఈ.ప్రభులత గారు పేర్కొన్నారు.
భారత స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ వీసీ సజ్జనార్ గారి పిలుపుమేరకు రాష్ట్ర వ్యాప్త రక్తదాన కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం ఖమ్మం లోని ఆర్టీసీ నూతన ప్రయాణ ప్రాంగణం సమావేశ మందిరంలో ఖమ్మం డిపో మేనేజర్ శ్రీ డి.
శంకర్రావు గారి టీం ఖమ్మం ఆధ్వర్యంలో ఆర్టీసీ సీనియర్ మెడికల్ ఆఫీసర్ శ్రీ ఎ.
వి.గిరిసింహారావు గారి పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ శ్రీమతి ఎం.
ఈ.ప్రభులత గారు ప్రారంభించారు.
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, సమాజంలో చాలా మంది వ్యక్తులు,సంస్థలు రకరకాల దానాలు చేస్తూ ఉంటారన్నారు.
అయితే ప్రమాదంలో తీవ్ర రక్తస్రావమై ప్రాణాపాయ స్థితిలో ఉన్న తోటి మనిషిని కాపాడేందుకు అవసరమైన రక్తాన్ని దానం చేయడం అన్నిటికంటే మించిన దానమని పేర్కొన్నారు.
ప్రతి మనిషి శరీరం ఒక కర్మాగారంలాగా రక్తాన్ని తయారు చేస్తున్నందుకు గర్వించాలన్నారు.మంచి కార్యక్రమం లో భాగస్వాములైన విద్యార్థులు,ఆటో డ్రైవర్లు, ప్రయాణికులు మరియు ఆర్టీసీ ఉద్యోగులందరినీ ఆమె అభినందించారు.
ఆర్టీసీ ఖమ్మం రీజియన్ సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎ.వి.
గిరిసింహారావు గారు ప్రసంగిస్తూ, రక్తదానం యొక్క ఆవశ్యకతను గుర్తించిన ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ గారి పిలుపుమేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన మెగా రక్తదాన కార్యక్రమం శుభ పరిణామం అన్నారు.
ప్రపంచంలోని ఏ ప్రయోగశాల లోనూ కృత్రిమంగా రక్తం తయారు చేసే పరిస్థితులు లేవని, ప్రమాదాల్లో గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న మన తోటి వారికి మరియు గర్భిణీ స్త్రీలకు అవసరమైన రక్తాన్ని రక్తదాతల నుండే సేకరించడం జరుగుతుందన్నారు.
రక్తదాతలు ఇచ్చిన రక్తం నుండి మొత్తం నాలుగు తరగతులుగా విభజించబడి ప్లేట్లెట్స్, ప్లాస్మా , హిమోగ్లోబిన్ గాను ఉపయోగపడుతుందన్నారు.
అందువలన రక్తదాతలు అందరూ ప్రాణదాతలే అని పేర్కొన్నారు.ప్రతి ఆరోగ్యవంతమైన మనిషి మూడు నెలలకు ఒకసారి విరివిగా రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేయాలన్నారు.
రక్తదానం చేయటం ద్వారా మానసిక సంతోషం ఉంటుందని ఉత్సాహంగా,ఉల్లాసంగా ఉంటారని ఎటువంటి అపోహలకు గురికావాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
సామాజిక బాధ్యతా కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు ఆర్టీసీ ఉద్యోగులందరూ గర్వించాలని అన్నారు.ప్రతి ఒక్కరూ బాధ్యతగా రక్తదాన కేంద్రాలలో రక్త నిల్వలు తగ్గకుండా ఉండేందుక సహకారం అందిచాలని ఉద్భోధించారు.
రక్తదాన శిబిరంలో 28సార్లు రక్తదానం చేసిన ఆర్టీసీ సీనియర్ క్లర్క్ (ఫైనాన్స్) ఆర్.
సీతయ్య తో పాటు అకౌంట్స్ సూపరింటెండెంట్ ఎస్ కే.సుభాన్ మరియు పలువురు ఆర్టీసీ ఉద్యోగులు,కవిత మెమోరియల్ డిగ్రీ కళాశాల ఎన్.
సి.సి విద్యార్థులు,ప్రియదర్శిని డిగ్రీ కళాశాల విద్యార్థులు,ఆటో డ్రైవర్లు మొత్తంగా 86 మంది పాల్గొని రక్తదానం చేశారు.
ఈ కార్యక్రమంలో ఖమ్మం ప్రభుత్వ వైద్యశాల రక్తదాన శిబిరం బాధ్యులు కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఖమ్మం డిపో అసిస్టెంట్ మేనేజర్ (ట్రాఫిక్) వి.గౌతమి,అసిస్టెంట్ ఇంజనీర్ (మెకానికల్) పి శ్రీనివాస్, డిప్యూటీ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ జి.
రజిత,బస్ స్టేషన్ మేనేజర్ ఆర్.రఘుబాబు, సెక్యూరిటీ అండ్ విజిలెన్స్ కానిస్టేబుల్ అస్లాం భాషా,కంట్రోలర్ డి.
హరిలాల్, ఉద్యోగుల సంక్షేమ మండలి సభ్యులు దమ్మాలపాటి శ్రీనివాసరావు,ఆర్టీసీ ఉద్యోగుల పొదుపు మరియు పరపతి సహకార సంఘం ప్రతినిధి గుండు మాధవరావు,ఉద్యోగులు మెరుగు రవీంద్రనాథ్, పిల్లి రమేష్,సిరిపురపు సీతారామయ్య ఐతగాని రాజీవ్,ఆర్.
భుజంగర్ తదితరులు పాల్గొన్నారు.
యూఎస్ కాంగ్రెస్‌లో ఆరుగురు భారత సంతతి నేతల ప్రమాణ స్వీకారం!!