ఆర్టీసీ కార్గో పార్శిల్ మిస్సింగ్.. టెన్షన్ పడుతున్న అధికారులు.. ఎందుకంటే?
TeluguStop.com
ప్రస్తుత రోజులలో చాలా మంది ఆన్లైన్ షాపింగ్ ( Online Shopping )కు బాగా అలవాటు పడిపోయారు.
ఈ క్రమంలో బుక్ చేసిన ఆర్డర్స్ కరెక్ట్ సమయానికి డెలివరీ అవుతాయో లేదో కూడా అర్థమవని పరిస్థితిలు చాలానే ఉన్నాయి.
ఇలాంటి క్రమంలో కస్టమర్లు ఎదుర్కొనే సవాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
అనేక తిప్పలు పడి చివరకు ఆ పార్సల్ వస్తుందో లేదో కూడా అర్థం అవ్వని పరిస్థితులలో చాలా మంది ఉన్నారు.
అచ్చం అలాంటి సంఘటనని ఒకటి ఒంగోలులో చోటు చేసుకుంది.గత కొన్ని రోజులుగా ఆర్టీసీ కార్గో సర్వీస్ ( RTC Cargo Service )లను అందజేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.
పార్సల్స్ ను కరెక్ట్ సమయానికి డెలివరీ చేస్తున్న క్రమంలో చాలామంది ఆర్టీసీ కార్గో సేవలపై ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు.
"""/" /
అయితే, వినుకొండ డిపోకు రావలసిన పార్సల్లు రాకపోవడంతో కార్గో ఉద్యోగులు చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు.
ఇందుకు సంబంధించి పూర్తి వివరాలలోకి వెళ్తే.వినుకొండ( Vinukond )నుంచి తిరుపతికి ఒక ఆర్టీసీ బస్ అద్దెకు వెళ్ళింది.
ఈ క్రమంలో ఒంగోలులో 16 పార్సెల్స్ ఇచ్చారు.ఈ పార్సల్స్ అన్నీ కూడా నెల్లూరు వరకు బుక్ అయ్యి ఉన్నాయి.
అయితే, ఈ క్రమంలో 15 పార్సల్లు మాత్రమే కార్గో ఆఫీస్లోకి వచ్చాయి.కానీ, మరొక పార్సల్ రాలేదు.
దీంతో ఉద్యోగులందరూ కూడా చాలా కంగారుగా ఉన్నారు.అయితే, బస్సు డ్రైవర్ ఆ పార్సెల్ ను కార్గో ఆఫీస్ లో ఇవ్వలేదని కనిపెట్టేశారు.
ఇంకేముంది అతని పట్టుకొని పార్సల్ తీసుకొని రావాలని అనేక ఇబ్బందులు పడుతున్నారు.కాకపోతే, అప్పటికే ఆ డ్రైవర్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసాడు.
అద్దె బస్సు డ్రైవర్ ( Bus Driver )కావడంతో అతన్ని జాడ తెలుసుకోవడం చాలా కష్టతరంగా మారింది.
"""/" /
ఇంతకీ మిస్ అయిన పార్సెల్ లో ఏముందన్న విషయానికి వస్తే.
ఒక లక్ష రూపాయలు విలువ చేసే చీర ఉంది.అంత విలువ చేసిన చీర మిస్ అవ్వడంతో యజమాని ఆర్టీసీ కార్గో ఉద్యోగులపై ఒత్తిడి కలిగించాడు.
వాస్తవానికి ఆ చీర బుక్ చేసిన యజమాని ఎవరో కాదండోయ్.ఆర్టీసీ చైర్మన్ కోడలు.
దీంతో కార్గో లో పని చేసే ఉద్యోగులందరికి ఒక పెద్ద చిక్కే ఎదురయ్యింది.
ప్రస్తుతం వినుకొండ, ఒంగోలు, నెల్లూరు కార్గో సర్వీస్ లలో పనిచేస్తున్న ఉద్యోగులందరూ కూడా ఆ బస్సు డ్రైవర్ కోసమే గాలింపు చర్యలు చేపట్టారు.
ఆ సినిమాపైనే నిఖిల్ అభిమానుల ఆశలు.. అభిమానుల కోరిక నెరవేరుతుందా?