అంబేద్కర్ కలల సాకారానికి ఆర్.ఎస్.ఎస్.కృషి

ఆర్.ఎస్.

ఎస్.ప్రాంత సహ కార్యవాహ మల్లికార్జున్ జీ.

అంబేద్కర్ జయంతి వారోత్సవాలలో భాగంగా ఆర్ఎస్ఎస్ రూట్ మార్చ్.రాజన్న సిరిసిల్ల జిల్లా: అంబేద్కర్ కలలు కన్న సమరసతా సమాజం కోసం ఆర్.

ఎస్.ఎస్.

కృషి చేస్తోందని ఆర్.ఎస్.

ఎస్.ప్రాంత సహ కార్యవాహ ఉప్పలంచ మల్లికార్జున్ అన్నారు.

భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వారోత్సవాల లో భాగంగా ఆదివారం సాయంత్రం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ ఎస్ ఎస్)సిరిసిల్లశాఖ ఆధ్వర్యంలో సమరసత సంచలన్ కార్యక్రమాన్ని నిర్వహించింది.

ఈ సందర్భంగా స్వయంసేవకులు సంఘ యూనిఫామ్ ధరించి పట్టణంలోని పలు ప్రాంతాల మీదుగా పథ సంచలన్ (రూట్ మార్చ్) కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఇట్టి కార్యక్రమానికి ఆర్.ఎస్.

ఎస్.ప్రాంత సహ కార్యవాహ మల్లికార్జున్ జీ ముఖ్య వక్తగా హాజరై మాట్లాడారు.

భారత దేశం అత్యంత ప్రాచీన సాంస్కృతిక వారసత్వం కల్గిన దేశం అని, అనేక మంది మహాపురుషులు జన్మించారని తెలిపారు.

ఆదిశంకరులు, రామానుజులు, బసవేశ్వరుని వంటి మహనీయులు సమానత్వం కోసం, జాతి ఏకత్మత కోసం కృషి చేశారని వివరించారు.

అదే కోవలో డాక్టర్ జీ అంబేద్కర్ జీ లు తమ కార్యాచరణ చేపట్టారని అన్నారు.

హిందూసమాజాన్ని ప్రేమిస్తూ సమాజ లోపాల్ని సవరించేందుకు అంబేద్కర్ ఉద్యమించినట్లు చెప్పారు.స్వేచ్ఛ సమానత్వం గురించి ఆలోచించిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు.

ఈ అఖండంగా ఉంచడానికి దోహదం చేసే అనేక సూచనలు చేసినా ద్రష్ట శ్రీ అంబేద్కర్.

అందుకే దేశం మొత్తం ఆ గొప్ప నాయకుడిని జయంతిని ఘనంగా జరుపుకుంటుందని, ఆయన బోధనలను గుర్తు చేసుకుంటుందన్నారు.

భారతదేశ అభివృద్ధికి అంబేద్కర్ చేసిన అపురూపమైన కృషిని ప్రతి ఒక్కరూ గౌరవించుకోవాలన్నారు.ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ తో అంబేద్కర్ సత్సంబంధాలు కలిగి ఉన్నారని వివరించారు.

ఆర్ఎస్ఎస్ కార్యకర్తల ఆహ్వానం మేరకు 1939 సంవత్సరంలో ఆర్ఎస్ఎస్ సంస్థాపకులు డాక్టర్ తో కలిసి ఒకరోజు శిక్షణ శిబిరంలో అంబేద్కర్ పాల్గొన్నారని , 425 మంది కార్యకర్తలు పాల్గొన్న ఈ శిబిరంలో 100 కు పైగా షెడ్యూల్ కులాల కార్యకర్తలను అంబేద్కర్ శిబిరంలో చూసి ఆనందాన్ని వ్యక్తం చేశారని , తాను ఆశించిన సామాజిక సమానత కార్యాన్ని ఆర్ఎస్ఎస్ మౌనంగా చేస్తున్నదని వారు కొనియాడారని , హిందూ సమాజ సంఘటన చేస్తున్న ఆర్ఎస్ఎస్ పట్ల వారు ఎప్పుడూ పల్లెత్తు మాట అనలేదని , అంబేద్కర్ ఎప్పుడు ఆర్ఎస్ఎస్ తో సత్సంబంధాలు కలిగి ఉన్నారని తెలిపారు.

ఇట్టి కార్యక్రమంలో మాననీయ జిల్లా సంఘ్ చాలక్ డా.రమణా చారి, సహ సంఘ్ చాలక్ ఎలగందుల సత్యనారాయణ ముఖ్య అతిథి పబ్బ నాగరాజు, జిల్లా కార్యవాహ కొండేటి బాలరాజు, దేవేంద్ర , గోనె భూమయ్య, రాజ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

న్యాచురల్ గా ఫేషియల్ హెయిర్ ను రిమూవ్ చేయాలనుకుంటున్నారా.. అయితే ఈ రెమెడీ మీకోసమే!