మహిళలు ఇంట్లోనే ఉండాలి.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఆలోచనే ఇదే : ఎన్ఆర్ఐలతో రాహుల్
TeluguStop.com
భారత రాజకీయాల్లో ప్రేమ, గౌరవం, వినయం వంటివి తప్పిపోయాయన్నారు ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు , కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ( Rahul Gandhi )వ్యాఖ్యానించారు.
అమెరికా పర్యటనలో ఉన్న ఆయన టెక్సాస్( Texas )లోని ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీని ఉద్దేశించి మాట్లాడుతూ.
మహిళలు ఇంట్లో ఉండాలని ఆర్ఎస్ఎస్, బీజేపీ నమ్ముతున్నాయని మండిపడ్డారు.ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షనేతగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా రాహుల్ గాంధీ అమెరికాకు వచ్చారు.
"""/" /
మహిళల పట్ల భారతీయ పురుషుల దృక్పథం మారాలని ఆయన ఆకాంక్షించారు.
54 ఏళ్ల క్రితం ప్రారంభమైన మహిళా రాజర్వేషన్ బిల్లు(
Womens Reservation Bill ) సహా రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యానికి తాను మద్ధతుదారునని రాహుల్ అన్నారు.
మహిళలు వ్యాపారం ప్రారంభించేందుకు గాను వారిని ఆర్ధికంగా ఆదుకోవాలని, పురుషులతో సమానంగా చూడాలని కాంగ్రెస్ ఎంపీ సూచించారు.
బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లు మహిళలను ప్రత్యేక పాత్రకే పరిమితం చేయాలని భావిస్తున్నాయని.వారు ఇంట్లోనే ఉండాలి, వంట చేయాలి, ఎక్కువ మాట్లాడకూడదన్నదే వారి ఉద్దేశ్యమని రాహుల్ గాంధీ( Rahul Gandhi ) ఎద్దేవా చేశారు.
"""/" /
భారతదేశమంతా ఒకటే ఆలోచన అని ఆర్ఎస్ఎస్ నమ్ముతుందని.కానీ ఇండియా అంటే అనేక ఆలోచనలని కాంగ్రెస్ విశ్వసిస్తుందన్నారు.
కులం, మతం, భాష, సాంప్రదాయం, చరిత్రతతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కలలు కనడానికి అనుమతించాలని రాహుల్ కోరారు.
అమెరికాలో మాదిరిగా ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా పాల్గొనడానికి అనుమతించబడాలని తాము నమ్ముతున్నామన్నారు.భారత రాజకీయాల్లో ప్రేమ, గౌరవం, వినయం వంటి విలువలను చొప్పించడం తన పాత్ర అని రాహుల్ పేర్కొన్నారు.
ఇదే కార్యక్రమంలో బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించడంలో విఫలమైన తాజా లోక్‌సభ ఫలితాలపై పరోక్షంగా ప్రస్తావించారు రాహుల్ గాంధీ.
బీజేపీ మన సాంప్రదాయంపై , మన భాషపై దాడి చేస్తుందన్నారు.ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్దినిమిషాల్లోనే భారతదేశంలో బీజేపీకి, ప్రధానికి ఎవరూ భయపడలేదని రాహుల్ చెప్పారు.
అమెరికాకి భారతదేశం అవసరమని భారతీయ ప్రవాసులు రెండు దేశాల మధ్య వారధి వంటి వారని ఆయన వ్యాఖ్యానించారు.
నా కొడుకు యానిమల్ సినిమాలో రణబీర్ లాంటివాడు: అల్లు అర్జున్