ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అరెస్ట్ అప్రజాస్వామికం
TeluguStop.com
నల్లగొండ జిల్లా: బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిరుద్యోగుల పక్షాన గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని సత్యాగ్రహ దీక్షకు పిలుపునివ్వగా పోలీసులు అడ్డుకొని హౌస్ అరెస్ట్ చెయ్యడాన్ని బీఎస్పీ దేవరకొండ నియోజకవర్గ ఇంచార్జి ఎర్ర కృష్ణ జాంభవ్ తీవ్రంగా ఖండించారు.
ఆర్ ఎస్ పి అక్రమ అరెస్టును నిరసిస్తూ శనివారం దేవరకొండ పట్టణంలోని డా.
బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ముందు శాంతియుత మౌన దీక్ష చేపట్టారు.అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహారిస్తూ, ప్రజాస్వామ్యం బద్దంగా దీక్ష చేస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని హౌస్ అరెస్ట్ చెయ్యడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చెయ్యడమేనన్నారు.
తెలంగాణ నిరుద్యోగ యువత గ్రూప్ -2 పరీక్ష వాయిదా వెయ్యాలని అనేక నెలలుగా విజ్ఞప్తి చేస్తున్నా ప్రభుత్వం మాత్రం ఒంటెద్దు పోకడ పోతూ నిరుద్యోగుల గోడు వినే పరిస్తుల్లో లేదన్నారు.
రాబోయే రోజులల్లో యావత్ తెలంగాణ సమాజం బీఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పార్టీ సలహాదారు రాజారావు,నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ స్వేరో,మహిళా కన్వీనర్ లలిత,మొగులయ్య, ఇమ్రాన్,జాన్,తరుణ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
పాలు, అంజీర్ కలిపి తీసుకుంటే ఎన్ని ఆరోగ్య లాభాలో తెలుసా?