హుజూరాబాద్‌కు రూ.35కోట్లు విడుద‌ల‌.. టీఆర్ ఎస్‌లో భ‌యం పెరిగిందా?

హుజూరాబాద్ అంటే ఈట‌ల రాజేంద‌ర్‌కు కంచుకోట‌.ఈనియోజ‌క‌వ‌ర్గం ఏర్ప‌డ్డ‌ప్ప‌టి నుంచి వ‌రుస‌గా నాలుగుసార్లు ఆయ‌నే గెలుస్తూ వ‌స్తున్నారు.

ఇంకో లీడ‌ర్ కు అవ‌కాశ‌మే లేకుండా పోయింది.క‌నీసం ఈట‌ల‌కు పోటీ ఇచ్చే బ‌ల‌మైన నాయ‌కుడు కూడా లేకుండా పోయాడు.

ఇంత‌లా ఆయ‌న ఆ నియోజ‌క‌వ‌ర్గంలో పాతుకుపోయారు.ప్ర‌తి బ‌ల‌మైన నాయ‌కుడు ఈట‌ల‌కు అనుచ‌రుడుగానే ఉన్నారు.

అన్ని ఊర్లు ఆయ‌న‌కు ప‌ట్టున్న‌వే.మ‌రి ఇంత బ‌ల‌మైన నాయ‌కుడిని ఎదుర్కోవాలంటే టీఆర్ ఎస్‌కు పెద్ద స‌వాలే.

అందుకే ఆ నియోజ‌క‌వ‌ర్గంపై కేసీఆర్‌పై స్పెష‌ల్ ఫోక‌స్ పెడుతున్నారు.ఇందుకు టీఆర్ ఎస్ అధిష్టానం కూడా స‌ర్వ శ‌క్తులు ఒడ్డుతోంది.

నియోజ‌క‌వ‌ర్గంలోని అన్ని ఊర్ల‌కు మంత్రుల‌ను పంపి మ‌రీ పెండింగ్ లో ఉన్న అనేక ప‌నుల‌ను జెట్ స్పీడ్‌తో చేయిస్తోంది.

ప్ర‌జ‌ల‌కు పించ‌న్‌, రేష‌న్ కార్డు, డ‌బుల్ బెడ్‌రూమ్ ఇండ్లు ఇలా అన్ని వెంట‌నే సాంక్ష‌న్ చేస్తున్నారు నేత‌లు.

ఇక ఈ క‌రోనా స‌మ‌యంలో నిధుల్లేక క‌ట‌క‌ట‌లాడుతున్న ప్ర‌భుత్వం హుజూరాబాద్‌కు మాత్రం ప్ర‌త్యేకంగా నిధులు కేటాయించ‌డం ఇక్క‌డ సంచ‌ల‌నంగా మారుతోంది.

ఈ క్ర‌మంలోనే నిన్న ప్ర‌భుత్వం హుజూరాబాద్‌కు ఏకంగా రూ.35కోట్ల‌ను కేటాయించింది.

వీటిని హుజూరాబాద్ పట్ట‌ణ అభివృద్ధి కోసం ఉప‌యోగించాల‌ని ప్ర‌భుత్వం సూచించింది. """/"/ ఏ నియోజ‌క‌వ‌ర్గాన‌కీ నిధులు ఇవ్వ‌ని ప్ర‌భుత్వం ఇప్పుడు హుజూరాబాద్‌కు మాత్రం ఇవ్వ‌డం సంచ‌ల‌నం రేపుతోంది.

అంటే ఈట‌ల ఎఫెక్ట్ ఆ స్థాయిలో ఉంటుంద‌ని కేసీఆర్ భావిస్తున్నార‌ని తెలుస్తోంది.ఈట‌ల గెలుస్తాడ‌నే భ‌యం టీఆర్ ఎస్‌లో బాగానే క‌నిపిస్తోంది.

అయితే ఈ రూ.35కోట్ల‌లో 10కోట్లు తాగునీటి కోసం మిగ‌తా 25కోట్లు అభివృద్ధి ప‌నుల కోసం కేటాయించిన‌ట్టు స్ప‌ష్టం అవుతోంది.

ఇక త్వ‌ర‌లోనే పంచాయతీల‌కు కూడా నిధులు కేటాయిస్తార‌ని స‌మాచారం.ఇలా అన్ని ర‌కాలుగా టీఆర్ ఎస్ శ‌క్తులు కూడ‌గ‌డుతోంది.

చూడాలి మ‌రి ఎవ‌రు గెలుస్తారో.

బీట్ రూట్ ఆరోగ్యానికే కాదు జుట్టు రాలడాన్ని కూడా అడ్డుకుంటుంది.. ఎలా వాడాలంటే?