New York : న్యూయార్క్‌లో రూ.315 కోట్ల మాన్షన్.. దానిని కొనుగోలు చేసినవారికి షాక్?

తాజాగా న్యూయార్క్‌( New York )లోని ఒక సరస్సు దగ్గర ఒక పెద్ద ఇల్లు అమ్మకానికి పెట్టారు.

దాని ధర అక్షరాలా 38 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.315 కోట్లు).

ప్రముఖ సినీ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్( Steven Spielberg ) ఈ భవనం పక్కనే ఉంటున్నాడు.

కానీ ఈ ఇంటి విషయంలో ఒక సమస్య ఉంది.అదేంటంటే ఇల్లు కొన్న వ్యక్తి ప్రస్తుతం అందులో నివసించలేడు.

వినడానికి విడ్డూరంగా అనిపించినా ఇది వాస్తవం.ఇంటి యజమాని అయిన హ్యారీ మాక్లోవ్ వయస్సు ఇప్పుడు 87 ఏళ్లు.

అతను న్యూయార్క్ నగరంలో ఇళ్లు నిర్మించి విక్రయిస్తున్నాడు.హాంప్టన్‌లోని తన ఇంటిని కూడా అమ్మకానికి పెట్టాడు.

"""/" / హ్యారీ మాక్లోవ్( Harry Macklowe ) తరఫున పాల్ బ్రెన్నాన్ అనే వ్యక్తి ఇళ్లను విక్రయిస్తాడు.

అతడు రియల్ ఎస్టేట్ బ్రోకర్.ఇల్లు ఈస్ట్ హాంప్టన్ అనే గ్రామంలో జార్జికా సరస్సు దగ్గర ఉంది.

స్టీవెన్ స్పీల్‌బర్గ్ అదే గ్రామంలో నివసిస్తున్నాడు.చాలా మంది సినిమా ప్రేక్షకులకు అతడు సూపరిచితుడు.

ఇంత పెద్ద డైరెక్టర్ ఇంటి పక్కనే ఉన్నా ఆ ఇంటికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేదు.

అంటే ఆ ఇల్లు సురక్షితమైనది, నివసించడానికి చట్టబద్ధమైనది అని చెప్పే పేపర్ లేదు.

కొత్త ఇంటి యజమానికి ఈ కాగితం అవసరం.కానీ ఇంట్లో అది లేదు.

కాబట్టి కొత్త యజమాని ఇంట్లో నివసించలేడు.హ్యారీ మాక్లోవ్ ఇల్లు కట్టేటప్పుడు నిబంధనలను పాటించలేదు.

తనకి సరైన అనుమతులు రాలేదు.భూమికి, పర్యావరణానికి హాని కలిగించే పనులు కూడా చేశాడు.

21 నియమాలను ఉల్లంఘించాడు.నిబంధనలను ఉల్లంఘించినందుకు డబ్బులు చెల్లించాల్సి వచ్చింది.

కానీ చెల్లించలేదు.దీంతో గ్రామ అధికారులు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

"""/" / హ్యారీ మాక్లోవ్‌కు నిబంధనలను ఉల్లంఘించిన చరిత్ర ఉంది.1980లలో, అతను భవనాలను ధ్వంసం చేయడానికి కొందరు రౌడీలను నియమించాడు.

దానికి కూడా అతని వద్ద అనుమతులు లేవు.ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడేసాడు.

అందుకోసం చాలా డబ్బు చెల్లించాల్సి వచ్చింది.అయితే జైలుకు వెళ్లలేదు.

ఎందుకంటే అతడు తప్పు చేశాడనడానికి పోలీసుల వద్ద తగిన ఆధారాలు లేవు.హ్యారీ మాక్లోవ్ తన ఇంటిని అమ్మి చాలా డబ్బు పోగేయ్యాలని ట్రై చేస్తున్నాడు.

అయితే ఆ ఇంటికి అంత విలువ లేదని కొందరు అంటున్నారు.ఇంటి విలువ కేవలం 12 నుంచి 15 మిలియన్ డాలర్లు మాత్రమేనని ఉంటుందని వారు చెబుతున్నారు.

అది $38 మిలియన్ల కంటే చాలా తక్కువ.హ్యారీ మాక్లోవ్ కూడా గ్రామ బోర్డుతో న్యాయ పోరాటంలో ఉన్నాడు.

ప్రజలు తమ ఇళ్లతో ఏమి చేయవచ్చో, ఏమి చేయకూడదో బోర్డు నిర్ణయిస్తుంది.హ్యారీ మాక్లోవ్ చేసిన తప్పులను క్షమించేందుకు బోర్డు అంగీకరించలేదు.

హ్యారీ మాక్లోవ్ వారిని కోర్టుకు తీసుకెళ్లాడు.కోర్టు కేసు ఇంకా నడుస్తోంది.

ఇంటికి ఇంకా చాలానే సమస్యలు ఉన్నాయి.

అల్లు అర్జున్ బ్యాక్ టు బ్యాక్ ఇండస్ట్రీ హిట్లు కొట్టబోతున్నారా..?