రూ.16 లక్షలు నావే.. బ్యాంకు తప్పిదానికి రైతు షాక్ ట్రీట్‌మెంట్?
TeluguStop.com
రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్ జిల్లాలో(Ajmer District, Rajasthan State) ఓ వింత ఘటన చోటు చేసుకుంది.
కిషన్‌గఢ్(Kishangarh) ప్రాంతానికి చెందిన కనారామ్ జాట్ అనే రైతు ఖాతాలో పొరపాటున ఏకంగా 16 లక్షల రూపాయలు జమ అయ్యాయి.
డిసెంబర్ 31న బ్యాంక్ ఆఫ్ బరోడా(bank Of Baroda) అధికారులు పొరపాటున న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లించాల్సిన పంట బీమా ప్రీమియం డబ్బులను నేరుగా కనారామ్ ఖాతాలోకి పంపారు.
అయితే, డబ్బులు తన ఖాతాలో పడగానే కనారామ్ (Kanaram)మాత్రం వాటిని తిరిగి ఇవ్వడానికి నిరాకరించాడు.
జనవరి 2 నుంచి 4వ తేదీ మధ్యలో ఏకంగా 15 లక్షల రూపాయలను మూడు దఫాలుగా (ఒక్కోసారి 5 లక్షల చొప్పున) డ్రా చేసేశాడు.
ఈ విషయం జనవరి 10న బ్యాంకు అధికారుల దృష్టికి రావడంతో వారు షాక్ అయ్యారు.
వెంటనే కనారామ్‌ను సంప్రదించి డబ్బులు తిరిగి ఇవ్వమని కోరగా, తాను ఆ డబ్బులన్నీ ఖర్చు చేశానని చెప్పి తిరస్కరించాడు.
"పొరపాటు మీది, డబ్బులు నావి, రూ.16 లక్షలు వెనక్కి ఇచ్చేది లేదు" అని రైతు తెగేసి చెప్పాడు.
"""/" /
దీంతో విసిగిపోయిన బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజర్ జితేంద్ర ఠాకూర్ మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ పొరపాటు కారణంగా బ్యాంకుకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆయన తెలిపారు.కనారామ్ కిసాన్ క్రెడిట్ కార్డు, అతనికున్న 16 బీఘాల భూమి పత్రాలు తమ వద్ద ఉన్నాయని, డబ్బులు తిరిగి ఇవ్వకపోతే అతని భూమిని వేలం వేసి రికవరీ చేస్తామని బ్యాంకు అధికారులు స్పష్టం చేశారు.
"""/" /
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని, ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
కనారామ్ బ్యాంకు ఖాతా వివరాలను పరిశీలిస్తున్నామని, విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారి రామస్వరూప్ జాట్ వెల్లడించారు.
“ఎంత తింటావ్, రా?” అంటూ నోట్లు విసిరిన జనం.. అవినీతి అధికారి ఏం చేశాడంటే..?