కొత్త సంవత్సరంకు ఆర్‌ఆర్‌ఆర్‌ స్పెషల్‌, జక్కన్న ఏమన్నాడంటే

బాహుబలి సినిమా వచ్చి దాదాపుగా మూడు సంవత్సరాలు అవుతుంది.ఎట్టకేలకు రాజమౌళి తన తదుపరి సినిమాను తీసుకు రాబోతున్నాడు.

2020 సంవత్సరం జులై 30న జక్కన్న ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.

సినిమాకు సంబంధించిన ఎలాంటి విషయాలు కూడా ఇప్పటి వరకు జక్కన్న టీం నుండి అధికారికంగా బయటకు రాలేదు.

జక్కన్న ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. """/"/రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ఫస్ట్‌లుక్‌ విషయంలో అదుగో ఇదుగో అంటూ కాలం గడుపుతూ వస్తున్నాడు.

ఎట్టకేలకు కొత్త సంవత్సరం కానుకగా సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను రివీల్‌ చేయబోతున్నాడు.జక్కన్న విడుదల చేయబోతున్న ఒక్క పోస్టర్‌లో రామ్‌ చరణ్‌ మరియు ఎన్టీఆర్‌ల లుక్స్‌ రివీల్‌ కాబోతున్నాయట.

ఈ విషయమై జక్కన్న సన్నిహితుల వద్ద మాట్లాడుతూ ఫస్ట్‌లుక్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పాడట.

ఈ చిత్రంలో రామ్‌ చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా మరియు ఎన్టీఆర్‌ కొమురం భీం పాత్రల్లో నటిస్తున్న విషయం తెల్సిందే.

"""/"/రామ్‌ చరణ్‌ మరియు ఎన్టీఆర్‌ కాంబో అనగానే అంచనాలు ఆకాశాన్ని తాకేలా వస్తున్నాయి.

అంచనాలకు తగ్గట్లుగా సినిమాను జక్కన్న దాదాపుగా 350 కోట్ల బడ్జెట్‌తో సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

తెలుగుతో పాటు హిందీ మరియు తమిళం, కన్నడం, మలయాళం ఇంకా కొన్ని భాషల్లో కూడా ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాను విడుదల చేయబోతున్నారు.

వెయ్యి కోట్ల టార్గెట్‌తో జక్కన్న ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీని విడుదల చేయబోతున్నాడు.

స్విగ్గి చేసిన ప్రకటనపై మండిపడుతున్న దుకాణదారులు