సెన్సేషన్.. మరో మూడు అవార్డ్స్ తన ఖాతాలో వేసుకున్న ఆర్ఆర్ఆర్!

ఆర్ఆర్ఆర్.ఈ సినిమా పేరు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువుగా వింటూ ఉంటున్నాం.

స్టార్ హీరోలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన భారీ మల్టీ స్టారర్ సినిమాను అగ్ర డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేసాడు.

మన ఇండియన్ సినిమా గర్వించ దగ్గ సినిమాగా ఆర్ఆర్ఆర్ చరిత్రకెక్కింది.ఈ సినిమా గత ఏడాది మార్చి 25న రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యి 1200 కోట్లకు పైగానే కలెక్షన్స్ సాధించింది.

ప్రపంచ ఆడియెన్స్ ను ఎంతగానో అలరించిన ఈ సినిమా ఇప్పటికే పలు అంతర్జాతీయ పురస్కారాలను అందుకుంది.

హాలీవుడ్ లెవల్లో ఎందరో దర్శకులు సైతం ఈ సినిమాకు ఫిదా అయ్యారు.దీంతో పాటు హాలీవుడ్ లో వరుసగా పలు ప్రముఖ అవార్డులు అందుకుంటూ ఎప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంది.

"""/"/ ఇక ఈ సినిమా తాజాగా మరో ప్రముఖ అవార్డ్స్ సంస్థ నుండి మూడు అవార్డులను అందుకుని సెన్సేషన్ క్రియేట్ చేసింది.

హాలీవుడ్ లో ప్రముఖ అవార్డ్స్ సంస్థ అయినటువంటి హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ లో ఈ సినిమా బెస్ట్ యాక్షన్, బెస్ట్ యాక్షన్ చిత్రం, బెస్ట్ సాంగ్ క్యాటగిరీలో హాలీవుడ్ మూవీస్ తో పోటీ పడి మరీ గెలుపొందింది.

దీంతో ఈ సినిమా మరోసారి ఇంటర్నేషనల్ వైడ్ గా వార్తల్లో నిలిచింది. """/"/ ఇక అతి త్వరలోనే ఆస్కార్ అవార్డులు కూడా జరగనున్నాయి.

నాటు నాటు సాంగ్ ప్రపంచ ప్రతిష్టాత్మక పురస్కారం ఆస్కార్ కు నామినేట్ కావడంతో ఈ సినిమాకు సినీ ప్రముఖులు నుండి అభినందనలు వెల్లువెత్తు తున్నాయి.

ఇప్పటికే ఈ అవార్డుల వేడుక కోసం రామ్ చరణ్ అమెరికా చేరుకున్నారు.అక్కడ మీడియా ఛానెల్స్ కు ఇంటర్వ్యూ ఇస్తూ సందడి చేస్తున్నాడు.

మార్చి 12న జరగనున్న ఈ వేడుక కోసం అతి త్వరలోనే రాజమౌళి, ఎన్టీఆర్ తో పాటు టీమ్ సభ్యులు కూడా అక్కడకు చేరుకోనున్నారు.

వైరల్: ఎలా వస్తాయో ఇలాంటి ఆలోచనలు.. మెట్రోలో ఏకంగా..