కరోనా ఎఫెక్ట్‌ను పూర్తిగా వాడుకున్న జక్కన్న

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఎఫెక్ట్ ఎలా ఉందో అందరికీ తెలిసిందే.ఇప్పటికే పలు దేశాలు లాక్‌డౌన్ ప్రకటించి ప్రజలను ఇళ్లకే పరిమితం అయ్యేలా చేశాయి.

అయితే ఈ కరోనా ప్రభావంతో చాలా మంది ఉపాధిని కోల్పోవాల్సి వచ్చిందని, పూటగడవడం కూడా ఇబ్బందిగా ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇక సినీ రంగానికి సంబంధించిన ఎలాంటి పనులు కూడా జరగడం లేదు.అయితే కరోనా ప్రభావంతో ఏర్పడిన పరిస్థితులను ఎవరైనా వినియోగించుకున్నారా అంటే అది ఖచ్చితంగా రాజమౌళి అని చెప్పాలి.

ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రజలు ఇళ్లల్లోనే ఉండటంతో ఇంట్లోని టీవీలకు, ఫోన్‌లకే అతుక్కుపోతున్నారు.ఈ సమయంలో ఆర్ఆర్ఆర్ లాంటి బిగ్గెస్ట్ క్రేజ్ ఉన్న సినిమాకు మరింత క్రేజ్ తీసుకురాచ్చని రాజమౌళి నిరూపించాడు.

ఉగాది పండుగ సందర్భంగా ఆర్ఆర్ఆర్ టైటిల్ లోగో మరియు మోషన్ పోస్టర్‌తో ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపిన జక్కన్న, మార్చి 27న చరణ్ బర్త్‌డే సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశాడు.

ఇలా రెండు రోజుల గ్యాప్‌లో ఆర్ఆర్ఆర్ పై అంచనాలు పీక్స్‌కు తీసుకెళ్లాడు రాజమౌళి.

ఇక జనం కూడా ఆర్ఆర్ఆర్‌కు ఉన్న క్రేజ్‌ దృష్ట్యా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, వీడియోలను విపరీతంగా చూస్తు్న్నారు.

ఇలా కరోనా ప్రభావాన్ని కూడా తనకు అనుకూలంగా మార్చుకుని వావ్ అనిపించాడు రాజమౌళి.

ఆదిలాబాద్ జిల్లాలోని విత్తన గోదాముల్లో పోలీసుల తనిఖీలు