ఉగాది ట్రీట్ ఇచ్చేసిన ఆర్ఆర్ఆర్.. నిజమైన పండగకు సర్వం సిద్ధం
TeluguStop.com
ఎప్పుడెప్పుడా అని యావత్ భారతదేశ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ నుండి ఎట్టకేలకు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది.
ఈ సినిమాకు సంబంధించిన ఓ ముఖ్యమైన అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ తాజాగా అనౌన్స్ చేశారు.
దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తు్న్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ లోగోతో పాటు మోషన్ పోస్టర్‌ను ఉగాది పండుగా కానుకగా మార్చి 25న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
దీనికి సంబంధించిన అప్‌డేట్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు.ఈ పోస్టర్‌లో ఇద్దరు హీరోల చేతులు మాత్రమే మనకు చూపించారు.
మొత్తానికి యావత్ భారతదేశ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ టైటిల్ ఏమిటనేది ఈ టైటిల్ లోగో మరియు మోషన్ పోస్టర్‌లో మనకు తెలుపనున్నారు.
ఇక ఈ మోషన్ పోస్టర్‌లో హీరోల ఫస్ట్ లుక్ ఉంటుందా లేక కేవలం టైటిల్‌ను మాత్రమే వదులుతారా అనేది రేపు తెలుస్తోంది.
ఏదేమైనా ఈ తాజా అప్‌డేట్‌తో ఆర్ఆర్ఆర్ ప్రేక్షకుల్లో ఒక్కసారిగా నిజమైన పండగ వాతావరణం మొదలైంది.
మెగా మేనల్లుడు సాయి తేజ్ కి షాక్ ఇచ్చిన పోలీసులు… నోటీసులు జారీ!