అప్పటి వరకు ఆర్‌ఆర్ఆర్ సినిమా యూనిట్‌ సభ్యులు అమెరికాలోనే ఉంటారా?

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వం లో వచ్చిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా యొక్క యూనిట్‌ సభ్యులు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు.

రామ్‌ చరణ్ వెళ్లి దాదాపు వారం రోజులు అవుతుంది.ఇతర యూనిట్‌ సభ్యులు కూడా అమెరికా వెళ్లారు.

ఇప్పుడు ఎన్టీఆర్ కూడా అమెరికా వెళ్లేందుకు సిద్ధం అవుతున్నాడు.చిత్ర యూనిట్‌ సభ్యులు అంతా కూడా అమెరికా వెళ్తున్న నేపథ్యంలో ఆస్కార్‌ అవార్డు వేడుక జరబోయే రోజు వరకు అక్కడే ఉంటారు అనే టాక్ వినిపిస్తుంది.

ఈ నెలలోనే 13వ తారీకున అస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం వైభవంగా జరగబోతుంది.

సినిమా లోని నాటు నాటు పాట ఆస్కార్ నామినేషన్స్ ను దక్కించుకున్న విషయం తెల్సిందే.

అందుకే అవార్డు ప్రధానోత్సవం సందర్భంగా అమెరికాలో యూనిట్‌ సభ్యులు అంతా ఉండాలి అంటూ ఆస్కార్‌ అకాడమి వారు ఆహ్వానించి ఉంటారు.

అందుకే అవార్డు వేడుకలో పాల్గొనేందుకు మరియు ముందస్తుగా ఉండే కార్యక్రమాల్లో పాల్గొనేందుకు గాను చిత్ర యూనిట్‌ సభ్యులు అంతా కూడా పనులు అన్ని పక్కన పెట్టి అమెరికా విమానం ఎక్కేశారు.

"""/" / మరో పది రోజుల పాటు అక్కడే మన వాళ్లు అంతా కూడా సందడి చేయబోతున్నారు.

తెలుగు సినిమా పాటకు ఆస్కార్‌ అవార్డ్‌ రాబోతుంది అనే ఆశతో తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా యావత్‌ దేశం యొక్క సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

రికార్డు స్థాయి వసూళ్లు సాధించిన ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా కు ఆస్కార్ అవార్డు వస్తే అంతకు మించిన రికార్డు అనడంలో సందేహం లేదు.

ఇప్పటి వరకు ఆస్కార్‌ దక్కని ఇండియన్ సినిమాకు నాటు నాటు ఆస్కార్‌ తెచ్చేలా ఉంది అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.

రాజమౌళి కనుక నాటు నాటు పాటకు ఆస్కార్ ను అందుకుంటే ఇండియన్ సినీ చరిత్రలో రాబోయే వందేళ్ల పాటు నిలిచి పోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

పెళ్లి కొడుకే స్వయంగా మంత్రాలు చదువుతూ పూజారిగా మారాడు.. వీడియో చూస్తే అవాక్కవుతారు!