RRR : రామ్ చరణ్ ఆలియా లేటెస్ట్ షెడ్యూల్ షురూ..!

రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ సినిమా ఆర్ ఆర్ ఆర్ ( రౌద్రం రణం రుధిరం ).

ఈ సినిమాలో తెలుగు స్టార్ హీరోలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు నటిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది.ఈ సినిమాను భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తున్నారు.

ఈ సినిమా కోసం రాజమౌళి అన్ని ఇండస్ట్రీల నుండి నటీనటులను ఎంపిక చేసుకున్నారు.

ఎందుకంటే ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రూపొందుతుంది కాబట్టి అన్ని పరిశ్రమల నుండి నటీనటులను తీసుకుంటే సినిమా ప్రమోషన్ పరంగా కూడా ఉపయోగపడుతుందని రాజమౌళి ఆలోచన.

ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తుంటే.రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు.

ఈ సినిమాను డివివి దానయ్య 400 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.ఈ సినిమా రిలీజ్ కోసం అన్ని భాషల్లోని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

తాజాగా ఆర్ఆర్ఆర్ నుండి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది.ఈ సినిమాలో రామ్ చరణ్, ఆలియా భట్ మీద కొత్త షెడ్యూల్ ప్రారంభం అవ్వబోతుందని సమాచారం.

అంతేకాదు ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్, ఆలియా భట్ మీద రొమాంటిక్ సాంగ్ పార్ట్ కూడా చిత్రీకరిస్తున్నారని తెలుస్తుంది.

"""/"/ ఈ షెడ్యూల్ వచ్చే వారం మొదలు కాబోతుందని తెలుస్తుంది.అంతేకాదు ఈ షెడ్యూల్ కోసం భారీ సెట్ కూడా ఏర్పాటు చేశారట.

మరి చూడాలి ఈ రొమాంటిక్ సాంగ్ స్క్రీన్ పై ఎంత అందంగా ప్రెసెంట్ చేస్తారో.

ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ కూడా ఒక ముఖ్య పాత్రను పోషిస్తున్నాడు.

ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 13 న రిలీజ్ చెయ్యాలని చిత్ర యూనిట్ భావిస్తున్నారు.

సూర్య కంగువ సినిమా మీద ఫోకస్ చేసిన అమీర్ ఖాన్…కారణం ఏంటంటే..?