సందేహాల మధ్య RRR రిలీజ్ డేట్.. ఇంతకీ జక్కన్న నిర్ణయం ఏంటో !
TeluguStop.com
ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీలలో ఆర్ ఆర్ ఆర్ సినిమాపై మంచి హైప్ వచ్చింది.
ఈ సినిమా విడుదల కోసం ఫ్యాన్స్ ఎంతో ఎదురు చూస్తున్నారు.అయితే ఈ సినిమా అక్టోబర్ 13 న విడుదల చేస్తామని జక్కన్న ఎప్పుడో ప్రకటించాడు.
అయితే మధ్యలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా మళ్ళీ వాయిదా పడుతుందని అందరు భావించారు.
అంతేకాదు థియేటర్స్ కూడా మొన్నటి వరకు ఓపెన్ అవ్వక పోవడంతో ఈ సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ లేకుండా పోయింది.
"""/"/
అయితే రాజమౌళి అప్పుడప్పుడు ఈ సినిమా అప్డేట్ ఇస్తున్న పోస్టర్స్ లో అక్టోబర్ 13 అనే ఉండడంతో అంతా కూడా ఈ సినిమా దసరాకే రాబోతుందని గట్టిగ ఫిక్స్ అయ్యారు.
నిన్న మొన్నటి వరకు కూడా ఎంతో నమ్మకంగా ఉన్న ఈ సినిమా రిలీజ్ డేట్ పై గత రెండు రోజులుగా రూమర్స్ బాగా వినిపిస్తున్నాయి.
ఈ సినిమా రిలీజ్ డేట్ పై చిత్ర యూనిట్ ఇంకా సందేహంగానే ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
మళ్ళీ కరోనా థర్డ్ వేవ్ ఉంటుందని వస్తున్న వార్తలు నేపథ్యంలో రాజమౌళి ఎలాంటి నిర్ణయం తీసుకోలేక పోతున్నాడని మళ్ళీ రిలీజ్ డేట్ వాయిదా వేస్తె ఈసారి ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అవుతారని అందుకే ఎటు తేల్చుకోలేక సందేహంలో జక్కన్న ఉన్నాడని అనుకుంటున్నారు.
అంతేకాదు నార్త్ సైడ్ ఇప్పటికీ కరోనా కారణంగా థియేటర్స్ ఓపెన్ అవ్వలేదు.ఒకవేళ ఎలా ఉన్న రిలీజ్ చెయ్యాలని అనుకున్న రిజల్ట్ ఎలా ఉంటుందో అని చిత్ర యూనిట్ ఆలోచిస్తున్నట్టు సమాచారం.
"""/"/
అందుకే ముందుగా చెప్పినట్టు అక్టోబర్ 13 న ఈ సినిమాను రిలీజ్ చెయ్యాలా లేక క్రిస్మస్ కు రిలీజ్ చెయ్యాలా అని చిత్ర యూనిట్ తమలో తామే తర్జన భర్జన పడుతున్నట్టు తెలుస్తుంది.
ఎందుకంటే భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న పాన్ ఇండియా సినిమా కావడంతో రిలీజ్ లో ఏదైనా తేడా జరిగితే నిర్మాతలకు కోట్లలో నష్టం వాటిల్లుతుంది.
అందుకే ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఇన్ని సందేహాలు.మరి చూడాలి జక్కన్న చివరకు ఏ నిర్ణయం తీసుకుంటాడో.
వీడియో వైరల్.. చెత్త లారీతో డోనాల్డ్ ట్రంప్