జపాన్ లో ట్రిపుల్ ఆర్ హవా.. ఫస్ట్ డే ఎంత రాబట్టిందో తెలుసా?
TeluguStop.com
టాలీవుడ్ లో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కిన సినిమా ట్రిపుల్ ఆర్.
అగ్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాడు.ఈ సినిమాలో ఇద్దరు టాలీవుడ్ స్టార్స్ నటించారు.
అల్లూరి సీతారామరాజు గా చరణ్, కొమురం భీం గా ఎన్టీఆర్ నటించి.నటన పరంగా అదరగొట్టారు.
ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించు కున్నారు.అభిమానులతో పాటుగా సినీ ప్రముఖులు కూడా ఈ ఇద్దరి హీరోల నటనకు ఫిదా అయ్యారు.
నాలుగేళ్ళ నిరీక్షణకు ఫుల్ స్టాప్ పెట్టి ఈ సినిమా వరల్డ్ వైడ్ గా మార్చి 25న రిలీజ్ అయిన విషయం తెలిసిందే.
బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
బాక్సాఫీస్ కలెక్షన్లను కొల్లగొట్టి అందరి చేత శబాష్ అనిపించు కున్నారు.జక్కన్న ఈ సినిమాతో మరోసారి ఇండియన్ సినిమా దగ్గర మన తెలుగు ఖ్యాతిని పెంచేసాడు.
"""/"/
ఇక ఇప్పుడు ఈ సినిమాను జపాన్ లో కూడా రిలీజ్ చేయబోతున్నారు.
ఈ సినిమా జపాన్ వర్షన్ లో అక్టోబర్ 21న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.
మరి ఇండియన్ సినిమా దగ్గర సూపర్ హిట్ అయినా ఈ సినిమాకు జపాన్ లో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.
రాజమౌళి తో పాటు ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా జపాన్ వెళ్లి అక్కడ ప్రొమోషన్స్ చేసి వారిని ఇంప్రెస్ చేసారు.
మరి తాజాగా ఈ సినిమా జపాన్ లో ఎంత వసూళ్లు చేసిందో బయటకు వచ్చింది.
ఈ సినిమాకు ఫస్ట్ డే 8 వేలకు పైగానే ఫుట్ ఫాల్స్ ఉన్నాయి.
గతంలో జపాన్ లో ప్రభాస్ సాహో సినిమా 6 వేల 509, బాహుబలి 2 కు 1382, అమీర్ ఖాన్ దంగల్ సినిమాకు 1265 ఫుట్ ఫాల్స్ మాత్రమే ఉన్నాయి.
దీంతో మన ట్రిపుల్ ఆర్ రేసులో ఎంత ముందు ఉందో తెలుస్తుంది.ప్రొమోషన్స్ కలిసి రావడంతో ఈ సినిమాకు తొలిరోజు ఏకంగా 25 కోట్ల కలెక్షన్స్ వచ్చాయని టాక్ వస్తుంది.
బోస్టన్‌లోనూ “చుట్టమల్లే” సాంగ్ ఫీవర్.. టెరిఫిక్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టారు!