ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్‌లో అదే హైలైట్!

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు దర్శకధీరుడు రాజమౌళి రెడీ అవుతున్నాడు.

కాగా ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై అతిభారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఇక ఈ సినిమాను పీరియాడికల్ ఫిక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాజమౌళి తెరకెక్కిస్తున్నాడు.అయితే ఈ సినిమాలో చాలా అంశాలు ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది.

ఇందులో ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ అందరినీ ఆకట్టుకునే విధంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

ఎన్టీఆర్, చరణ్‌ల మధ్య నడిచే ఎమోషనల్ బాండింగ్, క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్‌తో కలిపి ఈ సినిమాను అదిరిపోయే రేంజ్‌కు తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది.

ఈ క్లైమాక్స్‌లో తారక్, చరణ్‌ల యాక్టింగ్ ఆర్ఆర్ఆర్ సినిమాకే హైలైట్ కానుందని తెలుస్తోంది.

ఇక తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తుండగా, చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు.

భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు.ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్, ఒలివియా మారిస్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఇక ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

వీడియో: పాడుబడిన ఇంట్లో వెతుకుతుంటే ఊహించని ట్విస్ట్.. గోడల్లో నిధి చూసి షాక్!