రామ్ చరణ్ మీసాల గురించి సోషల్ మీడియాలో చర్చ
TeluguStop.com
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్త ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలో నటిస్తున్న చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రను పోషిస్తున్న విషయం తెల్సిందే.
ఆ చిత్రంలో రామ్ చరణ్ లుక్ ఎలా ఉంటుంది అనేది ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు.
కాని ఆయన ప్రస్తుతం మీసాలు చూస్తుంటే మాత్రం చాలా విభిన్నంగా వినూత్నంగా ఆ పాత్ర లుక్ ఉంటుందని మెగా ఫ్యాన్స్ చాలా నమ్మకంగా ఉన్నారు.
రాజమౌళి దర్శకత్వంలో సినిమా అంటే అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉంటాయి.అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాను చేస్తున్నాడు.
ఉగాదికి సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయాలని భావిస్తున్నారు.అందుకు సంబంధించి ఇప్పటి వరకు తేదీలు ప్రచారం జరిగినా కూడా ఏది నిజం కాలేదు.
కాని ఇప్పుడు మాత్రం ఉగాదికి ఖచ్చితంగా ఫస్ట్‌లుక్ వస్తుందనే నమ్మకంతో ఉన్నారు.ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ చరణ్ లుక్ కోసం చాలా ఇంట్రెస్ట్‌తో ఎదురు చూస్తున్నారు.
"""/"/రామ్ చరణ్ బర్త్‌డే కూడా వస్తున్న నేపథ్యంలో అసలు ఈ మీసాల కథ ఏంటీ అంటూ కొందరు ఆలోచన చేస్తున్నారు.
చరణ్ లుక్ కోసం ఫ్యాన్స్ గత సంవత్సర కాలంగా ఎదురు చూస్తున్నారు.ఎన్టీఆర్ లుక్ అయినా అప్పుడప్పుడు లీక్ అయ్యింది.
కాని చరణ్ లుక్ మాత్రం కనీసం లీక్ కూడా కాలేదు.అందుకే చరణ్ ఫ్యాన్స్ ఎంతో ఉత్కంఠభరితంగా లుక్ కోసం ఎదురు చూస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.
ఈలోపు చరణ్ మీసాలతో కనిపిస్తున్న కారణంగా ఆయన మీసాల గురించి మరింతగా చర్చనీయాంశం అవుతుంది.
అల్లు, మెగా ఫ్యామిలీలు కలిసిపోయినట్టేనా.. ఈ కుటుంబాల మధ్య గ్యాప్ తగ్గుతుందా?