నవంబర్ వరకు నో అంటోన్న ఆర్ఆర్ఆర్

దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్‌ను చెడుగుడు ఆడేందుకు రాజమౌళి రెడీ అవుతున్నాడు.ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు పీక్స్‌కు చేరుకున్నాయి.

కాగా ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావంతో వాయిదా పడిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా షూటింగ్ తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

అయితే ఇప్పుడిప్పుడే సినిమా షూటింగ్‌లు ప్రారంభం అవుతుండటంతో ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్ కూడా తిరిగి ప్రారంభం అవుతుందని అందరూ అనుకున్నారు.

కానీ జక్కన్న ఈ సినిమా షూటింగ్ ఊసే ఎత్తడం లేదట.కరోనా వైరస్ రోజురోజుకూ విజృంభిస్తుండటంతో, ఈ సినిమా షూటింగ్‌ను మరింత వాయిదా వేస్తూ వస్తున్నారు.

ఏదేమైనా ఈ సినిమా షూటింగ్‌ను నవంబర్ నెలలో తిరిగి ప్రారంభించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

అప్పటివరకు కరోనా వ్యాక్సిన్ కూడా వచ్చే ఛాన్స్ ఉందని చిత్ర యూనిట్ ఆశిస్తోంది.

అన్నీ అనుకున్నట్లు కుదిరితే నవంబర్‌లో ఆర్ఆర్ఆర్ చిత్రం మళ్లీ సెట్స్‌పై కనిపిస్తుందని ప్రేక్షకులు ఆశిస్తున్నారు.

ఇక పీరియాడికల్ డ్రామాగా ఈ సినిమాను దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తుండగా, కొమురం భీం పాత్రలో తారక్, అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ నటిస్తున్నారు.

బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్, ఒలివియా మారిస్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తుండగా, బాలీవుడ్ హీరో అజయ్ దేవ్గన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

తెలుగులో నాని తమిళ్లో కార్తీ.. వీరిద్దరిని చూడటానికి రెండు కళ్ళు సరిపోవు..!