ఆర్ఆర్ఆర్‌లో అవి లేపేస్తున్నారా?

దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్‌లో భారీ ఎత్తున రిలీజ్ చేయాలని జక్కన్న అండ్ టీమ్ భావిస్తున్నారు.

దీంతో ఈ సినిమాపై అతిభారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.కాగా ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మెజారిటీ శాతం పూర్తవ్వగా కరోనా వైరస్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వాయిదా పడింది.

దీంతో ఈ సినిమా రిలీజ్‌పై తీవ్ర ప్రభావం పడింది.ఇప్పటికే ఈ సినిమాను జూలై 2020 నుండి జనవరి 2021కు వాయిదా వేశారు చిత్ర యూనిట్.

కాగా ఇప్పుడు కరోనా కారణంగా ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేయాలని జక్కన్న భావిస్తున్నాడు.

అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈ సినిమాను వేసవిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీగా లేనట్టు తెలుస్తోంది.

అనుకున్న సమయానికి సినిమా షూటింగ్‌ను ముగించి వేసవిలో రిలీజ్ చేసేందుకు ఈ సినిమాలో భారీ మార్పులు చేసేందుకు జక్కన్న రెడీ అయ్యాడట.

ఈ సినిమాలో వచ్చే కొన్ని పాటలను పూర్తిగా లేపేయాలని ఆయన అనుకుంటున్నాడు.దీంతో కథలో ఎలాంటి మార్పులతో ఈ సినిమా వస్తుందా అని అందరూ అనుకుంటున్నారు.

మరి ఆర్ఆర్ఆర్‌లో ఎలాంటి పాటలను లేపేస్తున్నారో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

మైక్ ఇస్తే చాలు.. స్టేజ్ పై చెత్త వాగుడు వాగుతున్న దర్శకులు