ఆర్‌ఆర్‌ఆర్ ఫ్రెండ్‌షిప్ డే స్పెషల్.. కేజీఎఫ్ రికార్డ్ బ్రేక్
TeluguStop.com

టాలీవుడ్ తో పాటు యావత్ దేశం మొత్తం ఆర్ ఆర్ ఆర్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.


అద్బుతం అనే కంటే అంతకు మించి అన్నట్లుగా ఆర్ ఆర్ ఆర్ సినిమా ఉంటుందని ప్రతి ఒక్కరు నమ్మకంగా ఉన్నారు.


చిత్ర యూనిట్ సభ్యుల కంటే ఆ సినిమా కోసం ఎదురు చూస్తున్న వారు ఎక్కువగా ఇంట్రెస్ట్ తో నమ్మకంతో ఉన్నారు.
ఇక ఈ సినిమా తో బాహుబలి రికార్డులను కూడా బ్రేక్ చేస్తారనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.
వసూళ్ల విషయం ఏమో కాని మొదటగా కేజీఎఫ్ 2 టీజర్ రికార్డు ను బద్దలు కొట్టాలని అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా దక్కించుకోని రికార్డు స్థాయి వ్యూస్ ను యూట్యూబ్ లో కేజీఎఫ్ 2 టీజర్ దక్కించుకుంది.
అద్బుతం అన్నట్లుగా కేజీఎఫ్ 2 టీజర్ లేకున్నా కూడా ఎందుకో జనాలు తెగ చూశారు.
ఏకంగా 200 మిలియన్ ల వ్యూస్ ను దక్కించుకుంది.కేవలం టీజర్ ఆ రేంజ్ లో వ్యూస్ ను దక్కించుకోవడం ఇప్పటి వరకు సినీ చరిత్రలో జరగలేదు.
కాని ఇటీవలే అరుదైన రికార్డును దక్కించుకున్న కేజీఎఫ్ 2 కు నిరాశ తప్పదేమో అంటున్నారు.
ఎందుకంటే ఆగస్టు మొదటి వారంలో స్నేహితుల దినోత్సవం సందర్బంగా ఆర్ ఆర్ ఆర్ సినిమా టీజర్ ను విడుదల చేయబోతున్నారు.
"""/"/
అక్టోబర్ లో సినిమా ను విడుదల చేయబోతున్న నేపథ్యంలో ఆగస్టులో మంచి సమయం చూసి టీజర్ విడుదల చేయాలనుకున్నారు.
ఇద్దరు మంచి స్నేహితులు కనుక ఆ రోజున ఆర్ ఆర్ ఆర్ టీజర్ ను విడుదల చేయబోతున్నారు.
టీజర్ లో ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లు ఉండబోతున్నారు.అద్బుతం అన్నట్లుగా వీరి కాంబో సన్నివేశాలు ఉంటాయని అంటున్నారు.
భారతీయ విద్యార్ధులపై ఆస్ట్రేలియన్ యూనివర్సిటీల ఆంక్షలు.. ఎందుకంటే..?