ఆ థియేటర్ లో ఏకంగా 21 నెలలు ఆడిన ఆర్ఆర్ఆర్.. సంచలనం అంటూ?

టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి( Rajamouli ) దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన సినిమా ఆర్ఆర్ఆర్.

ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.అంతేకాకుండా తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన సినిమాలలో ఈ సినిమా కూడా ఒకటి.

ఈ సినిమా అటు రాజమౌళితో పాటు ఇటు తారక్, చెర్రీ ( Jr Ntr , Ram Charan )లకు కూడా భారీగా గుర్తింపును తెచ్చిపెట్టింది.

దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

"""/" / అంతేకాకుండా విడుదల అయిన కొన్ని రోజుల్లోనే రికార్డుల మీద రికార్డులు సృష్టించింది.

విడుదల అయిన అన్ని ప్రదేశాలలో సూపర్ హిట్ గా నిలిచింది.అలాగే ఈ చిత్రం ఎన్నో వండర్స్ సెట్ చేసింది.

అయితే ఈ సినిమా మన దేశంలో రన్ ఏమో కానీ జపాన్( Japan ) దేశంలో అయితే మన దగ్గర కంటే భారీ రన్ ని చూసింది.

అక్కడ ఏకంగా సంవత్సరాలు తరబడి రన్ అవుతోంది.అలా లేటెస్ట్ గా మేకర్స్ ఇంట్రెస్టింగ్ ఎమోషనల్ మూమెంట్ ని షేర్ చేసుకున్నారు.

జపాన్ లోని ఒక హిస్టారికల్ థియేటర్ లో ఆర్ఆర్ఆర్ సినిమా ఏకంగా ఒక సంవత్సరం 9 నెలలు నిర్విరామంగా రన్ కావడం ఎంతో ఆనందంగా ఒకింత ఎమోషనల్ గా కూడా ఉందని వారు తెలుపుతున్నారు.

"""/" / మరి ఈ రేంజ్ లో ఒక భారతీయ సినిమా అందులోని మన తెలుగు సినిమా రన్ కావడం అనేది చిన్న విషయం అయితే కాదని చెప్పాలి.

ఈ విషయాన్ని మూవీ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించడంతో అభిమానులు, నెటిజన్స్, మూవీ మేకర్స్ కి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

నిజంగా ఇది చాలా గర్వించదగ్గ విషయం.ఒక సినిమా 21 నెలలు ఆడడం అంటే మామూలు విషయం కాదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ప్రస్తుత జనరేషన్లో వంద రోజులు సినిమా ఆడడం ఎక్కువ అనుకుంటే 21 నెలలు వాడడం అన్నది నిజంగా చాలా గ్రేట్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

కొత్త దర్శకుల ముందు సీనియర్ డైరెక్టర్స్ తేలిపోతున్నారా..?