ఆర్ఆర్ఆర్ కి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌.. కాని చిన్న మెలిక!

రాజమౌళి దర్శకత్వం లో టాలీవుడ్ బిగ్గెస్ట్ హీరో లు అయిన ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లు కలిసి నటించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది.

మార్చి 25 తారీ ఖున భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తం గా ఈ సినిమాను విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే.

అమెరికా తో పాటు పలు ప్రపంచ దేశాల్లో ఈ సినిమా రికార్డు స్థాయి లో విడుదల చేయబోతున్న సమయంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా అత్యధిక థియేటర్లలో విడుదల చేసేందుకు ప్రభుత్వాల నుండి ఇటీవలే అను మతులు కోరడం జరిగింది.

ఈ సినిమా అదనపు షో మరియు టికెట్ల రేట్ల పెంపుకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తాజాగా ఓకే చెప్పినట్లుగా సమాచారం అందుతోంది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ సినిమాకు ప్రత్యేకంగా అనుమతులను మంజూరు చేయడంతో ఖచ్చితంగా నైజాం ఏరియాలో భారీ వసూళ్లను ఈ సినిమా దక్కించు కుంటుంది అంటూ ప్రతి ఒక్కరు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

అయితే సినిమా ఉదయం 7 గంటల నుండి రాత్రి 11 గంట వరకు అంటే తెల్లవారు జాము షో లు లేకుండా ఉదయం నుండి రాత్రి వరకు మాత్రమే ఐదు ప్లాన్ చేసుకోవాలి.

అంతే కానీ బెనిఫిట్‌ షో లు వేయడానికి అవకాశం లేదంటూ మెలిక పెట్టింది.

సినిమా విడుదలైన మొదటి రోజు కూడా బెనిఫిట్ షో వేసేందుకు అనుమతి లేదంటూ చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా తేల్చి చెప్పారు.

"""/" / కనుక ప్రభుత్వ అనుమతులు తగ్గట్లుగానే డిస్ట్రి బ్యూటర్లు మరియు బయర్లు సినిమా ని మార్నింగ్ 7 ప్రారంభించాలని నిర్ణయించారు.

బాలీవుడ్ స్టార్స్ ఆలియా భట్ మరియు అజయ్ దేవగన్ లు ఈ సినిమాలో కీలక పాత్రలో నటించడం వల్ల అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

ఈ సినిమా లో సీనియర్ హీరోయిన్ శ్రియ శరణ్ కూడా కనిపించ బోతున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్దం అవ్వడంతో ప్రతి ఒక్క అభిమాని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఖచ్చితంగా సినిమా భారీ వసూళ్లు నమోదు చేస్తుంది అంటూ ప్రతి ఒక్కరు కూడా నమ్మకంతో ఉన్నారు.

ఏంటి ఈ ట్విస్ట్ :  ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ‘ రామసహాయం రఘురాంరెడ్డి