'ఆర్‌ఆర్‌ఆర్‌' సంక్రాంతికి వస్తే పరిస్థితి ఏంటీ?

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వం లో ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ లు కలిసి నటించిన ఆర్ ఆర్ ఆర్‌ సినిమా షూటింగ్‌ ముగించుకుని విడుదలకు సిద్దం అయ్యింది.

ఈ సినిమాను దసరాకు విడుదల చేయాలని మొదట భావించారు.కాని కరోనా పరిస్థితులు పూర్తిగా తేరుకోలేదు.

ఉత్తరాదిన థియేటర్లు ఇంకా పూర్తి స్థాయిలో ఓపెన్‌ కాలేదు.కనుక ఆర్ ఆర్‌ ఆర్ సినిమాను వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు.

కొత్త విడుదల తేదీని ఎప్పుడు ప్రకటిస్తారు అనేది అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సినిమా షూటింగ్‌ పూర్తి అయిన తర్వాత ఎక్కవ కాలం వాయిదా వేయడం వల్ల చాలా నష్టం కలుగుతుంది.

అందుకే సినిమాను సాధ్యం అయినంతగా త్వరగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్‌ చేస్తున్నారు.

"""/"/ సంక్రాంతికి ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా ను విడుదల చేసేందుకు గాను చర్చలు జరుగుతున్నాయి అంటున్నారు.

అన్ని వర్గాల వారికి సంక్రాంతి అంటే సినిమా పండుగ.అందుకే ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయడం వల్ల ఖచ్చితంగా రికార్డు బ్రేకింగ్‌ వసూళ్లు నమోదు అవుతాయని అనుకుంటున్నారు.

అందుకే ఆర్ ఆర్‌ ఆర్‌ ను సంక్రాంతికి విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు.

ఇప్పటికే సంక్రాంతికి రెడీ అయిన రాధే శ్యామ్, భీమ్లా నాయక్‌ మరియు సర్కారు వారి పాట సినిమాలు విడుదల వాయిదా పడబోతున్నట్లుగా తెలుస్తోంది.

మొదటగా సర్కారు వారి పాట సినిమా చిత్రీకరణ చివరి దశకు వచ్చినా కూడా సంక్రాంతికి విడుదల చేయడం లేదు అంటున్నారు.

ఈ సమయంలో సంక్రాంతి సీజన్ లో ఏ సినిమాలు విడుదల అవుతాయి.ఎలాంటి పరిస్థితి ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 ఆర్ ఆర్‌ ఆర్ కనుక సంక్రాంతికి విడుదల అయితే టాలీవుడ్‌ లో పలు సినిమాల విడుదల తేదీలు అటు ఇటు అవుతాయి.

తారక్ ప్రశాంత్ నీల్ మూవీకి అదిరిపోయే టైటిల్ ఫిక్స్.. ఆ మూవీ టైటిల్ ఇదే!