'ఆర్‌ఆర్‌ఆర్‌' మళ్లీ డౌట్ అంటారేంటీ.. అసలేం జరుగుతోంది?

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో దాదాపుగా 400 కోట్ల బడ్జెట్ తో ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్‌ లు హీరోలుగా భారీ మల్టీ స్టారర్‌ మూవీగా రూపొందిన ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఉంది.

సినిమాను గత ఏడాదిలోనే విడుదల చేయాలనుకున్నా కూడా కరోనా వల్ల ఆలస్యం అయ్యింది.

ఈ ఏడాదిలో విడుదల చేయాలనుకున్నా కూడా కరోనా అడ్డు వస్తుంది.ఎట్టకేలకు వచ్చే ఏడాది జనవరిలో సినిమాను విడుదల చేద్దామనుకుంటే ఇతర సినిమాలు అడ్డు వస్తున్నట్లుగా టాక్ వినిపిస్తుంది.

సంక్రాంతికి విడుదల కాబోతున్నట్లుగా చాలా నెలల ముందే సర్కారు వారి పాట మరియు రాధే శ్యామ్‌ సినిమా లు ఫిక్స్‌ అయ్యాయి.

ఇటీవలే భీమ్లా నాయక్‌ సినిమా కూడా ఫిక్స్‌ అయ్యింది.ఈ మూడు సినిమా ల తర్వాత సంక్రాంతికి ముందు తమ ఆర్ ఆర్ ఆర్‌ ను విడుదల చేయబోతున్నట్లుగా వస్తున్నాయి.

ఈ మూడు సినిమాలు కూడా సంక్రాంతికి విడుదల కాబోతున్నాయి కనుక ఖచ్చితంగా ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా విడుదల విషయంలో పునరాలోచించాలంటూ కొందరు అంటున్నారు.

"""/"/ ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల విషయంలో జక్కన్న మళ్లీ ఆలోచనల్లో పడ్డాడు అనే విషయం ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

సంక్రాంతికి ముందు ఈ సినిమా విడుదల అవ్వడం డౌటే అని ఖచ్చితంగా ప్రకటించిన తేదీలో వస్తుందనే నమ్మకం మాత్రం కనిపించడం లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అందుకు కారణం ఇతర సినిమాల పోటీతో పాటు ఇంకా పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్ పనులు ఉన్నాయని చెబుతున్నారు.

పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్ విషయంలో జక్కన్న అస్సలు రాజీ పడడు.ముఖ్యంగా గ్రాఫిక్స్ విషయంలో ఖచ్చితంగా జక్కన్న రాజీ పడకుండా చేయిస్తాడు.

అందుకే ఆర్‌ ఆర్‌ ఆర్‌ ఆలస్యం అవుతుందనే నమ్మకంను కొందరు వ్యక్తం చేస్తున్నారు.

సుజీత్ నాని తో చేయబోయే సినిమా ఆ హాలీవుడ్ సినిమా నుంచి కాపీ చేశారా..?