రిలీజ్ కు ముందే ఆర్ఆర్ఆర్ రికార్డ్ బ్రేక్ చేసిన కల్కి.. అడ్వాన్స్ సేల్స్ తో అదరగొడుతోందిగా!

ఒక సినిమా క్రియేట్ చేసిన రికార్డ్ ను మరో సినిమా బ్రేక్ చేయడం సినిమా ఇండస్ట్రీలో సర్వ సాధారణం అనే సంగతి తెలిసిందే.

ఆర్ఆర్ఆర్ మూవీ( RRR Movie ) రిలీజ్ సమయంలో ఓవర్సీస్ లో అడ్వాన్స్ సేల్స్ విషయంలో అదరగొట్టింది.

అయితే రిలీజ్ కు ముందే ఆర్ఆర్ఆర్ రికార్డ్ ను బ్రేక్ చేసి కల్కి మూవీ వార్తల్లో నిలిచింది.

అడ్వాన్స్ సేల్స్ లో ఈ సినిమా అదరగొడుతూ వార్తల్లో నిలుస్తోంది.కల్కి మూవీ( Kalki Movie ) అడ్వాన్స్ సేల్స్ 1 మిలియన్ డాలర్స్ గా ఉండటం గమనార్హం.

ఆర్ఆర్ఆర్ అడ్వాన్స్ బుకింగ్స్ తో సాధించిన యూఎస్ కలెక్షన్లను ఈ సినిమా బ్రేక్ చేయడం గమనార్హం.

సినిమా రిలీజ్ సమయానికి అడ్వాన్స్ సేల్స్ తోనే ఈ సినిమా 2 మిలియన్ డాలర్ల కలెక్షన్లను సొంతం చేసుకునే అవకాశం ఉంది.

కల్కి సినిమా కలెక్షన్ల ప్రభంజనం రిలీజ్ కు ముందే మొదలైందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కల్కి సినిమా ట్రైలర్ మాత్రం యూట్యూబ్ లో అదరగొడుతోంది. """/" / కల్కి ట్రైలర్ తెలుగు వెర్షన్ కు ఏకంగా 20 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.

ఈ ట్రైలర్ సరికొత్తగా ఉందని అమితాబ్, ప్రభాస్, దీపిక పాత్రలు ట్రైలర్ లో హైలెట్ గా నిలిచాయి.

ఈ సినిమాలో దిశా పటానీ రాక్సీ పాత్రలో కనిపించనుండగా ఆమె పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ పోస్టర్ ను రిలీజ్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

ఇతర భాషల ప్రేక్షకులు సైతం సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. """/" / కల్కి ట్రైలర్ కు పాజిటివ్ టాక్ రావడంతో ఫ్యాన్స్ ఎంతో సంతోషిస్తున్నారు.

కల్కి సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు మాత్రం భారీ స్థాయిలో ఉండబోతున్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కల్కి సినిమా సీక్వెల్ పై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.ఈ సినిమా రిలీజ్ తర్వాత నాగ్ అశ్విన్ పేరు మారుమ్రోగడం ఖాయమని తెలుస్తోంది.

దుబాయ్: 5-స్టార్ రిసార్ట్ బాల్కనీలో బట్టలు ఎండేసిన ఇండియన్ మహిళ.. చివరికి?