అక్కడ ఆర్ఆర్ఆర్‏ మూవీ చూడటానికి ప్రేక్షకులు ముఖం చాటేస్తున్నారట.. అసలేమైందంటే?

ప్రపంచవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్‏ మూవీ కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లను సాధిస్తున్న సంగతి తెలిసిందే.

ఆర్ఆర్ఆర్‏ మూవీ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడవగా ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో రికార్డులు బ్రేక్ అవుతాయనడంలో సందేహం అవసరం లేదనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

అయితే కర్ణాటకలో ఈ సినిమా కన్నడ వెర్షన్ కంటే తెలుగు వెర్షన్ లోనే ఎక్కువ సంఖ్యలో థియేటర్లలో విడుదలైంది.

కన్నడ అభిమానులు ఆర్ఆర్ఆర్‏ మూవీ కన్నడ వెర్షన్ థియేటర్ల విషయంలో కొన్నిరోజుల క్రితం తమ అసంతృప్తిని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

ఆ తర్వాత కన్నడ వెర్షన్ విషయంలో డిస్ట్రిబ్యూటర్ల నుంచి హామీ వచ్చినా ఆర్ఆర్ఆర్‏ మూవీ కన్నడ వెర్షన్ ఎక్కువ సంఖ్యలో థియేటర్లలో విడుదల కాలేదు.

అయితే కర్ణాటకలోని రూరల్ ప్రాంతాల్లో తెలుగు వెర్షన్ కు పెద్దగా ఆదరణ దక్కడం లేదని సమాచారం అందుతోంది.

కర్ణాటక బార్డర్ ప్రాంతాలలో ఉండే ప్రేక్షకులు ఈ సినిమాను పట్టించుకోవడం మానేశారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

దేశంలోని చాలా ప్రాంతాల్లో ఆర్ఆర్ఆర్‏ మూవీకి హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తుంటే ఇక్కడ మాత్రం భిన్నమైన పరిస్థితి నెలకొంది.

ఆర్ఆర్ఆర్‏ మూవీ ప్రదర్శిస్తున్న థియేటర్లు ఇక్కడ ఖాళీగా ఉన్నాయి.ఇక్కడి థియేటర్స్ లో కన్నడ వెర్షన్ ను ప్రదర్శిస్తే ఆర్ఆర్ఆర్‏ మూవీ మరింత మెరుగైన కలెక్షన్లు సాధించే ఛాన్స్ ఉంది.

"""/"/ ఆర్ఆర్ఆర్‏ మూవీలో పాటలు పరిమితంగా ఉన్నా కొన్ని కమర్షియల్ అంశాలు మిస్సైనా ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాను ఆదరిస్తున్నారు.

చరణ్, తారక్ కెరీర్ లో ఆర్ఆర్ఆర్‏ మూవీ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.

ఈ సినిమా తర్వాత చరణ్, తారక్ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

చరణ్, తారక్ కు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది.

నాని సినిమాకు మెాహన్ బాబు ప్లస్ అవుతాడా? మైనస్ అవుతాడా..?