కోట్ల రూపాయల ప్రచారంతోనే ఆర్ఆర్ఆర్ కి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అవార్డు
TeluguStop.com
టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వం లో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా లోని నాటు నాటు పాట కి అంతర్జాతీయ స్థాయి గోల్డెన్ గ్లోబ్ అవార్డు సొంతం అవడం ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకులను ఆనందం లో ముంచెత్తింది.
ఈ సమయం లో కొందరు మాత్రం కేవలం కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ప్రచారం చేయడం వల్లే ఈ సినిమా కు గోల్డెన్ గ్లోబ్ అవార్డు సొంతమయ్యిందని.
అవార్డు ను కొనుక్కున్నట్లే అంటూ కొందరు అవహేళన చేసినట్లుగా మాట్లాడుతున్నారు.ప్రముఖ జర్నలిస్టు ఒకరు తన బ్లాగ్ లో ఇదే విషయాన్ని రాసుకున్నాడు.
అసలు విషయానికి వస్తే.మన సినిమా లను అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేసుకుంటేనే అవార్డు లు వస్తాయి.
మొదటి సారి ఒక అమెరికన్ ప్రముఖ ఏజెన్సీ మన ఇండియన్ సినిమా ను ప్రమోట్ చేసింది.
గతం లో ఆ ఏజెన్సీ ప్రమోట్ చేసిన సినిమాలకు పలు అవార్డులు సొంతమయ్యాయి.
కనుక కోట్ల రూపాయల ఒప్పందం తో ఆ ఏజెన్సీ కి మన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను అప్పగించారు.
"""/"/
వారు అద్భుతమైన పబ్లిసిటీ మరియు ప్రచారం నిర్వహించడం ద్వారా గోల్డెన్ గ్లోబ్ అవార్డు సొంతమయ్యేలా ప్రచారం నిర్వహించారు.
కేవలం వారి ప్రచారం కారణంగానే ఈ సినిమా కు అవార్డు సొంతం అయ్యింది అని అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
సోషల్ మీడియా లో కూడా ఈ సినిమా కు సంబంధించిన పబ్లిసిటీ కార్యక్రమాలు జోరుగా నిర్వహించారు.
అందుకే ఆస్కార్ కూడా ఇదే మాదిరిగా రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.టాలీవుడ్ జక్కన్న రాజమౌళి భారీ ఎత్తున ఖర్చు చేసి అవార్డు ని కొనుగోలు చేశాడు అనేవారికి ఆయన అభిమానులు కౌంటర్ ఇస్తున్నారు.
అంతకు మించి ఖర్చు చేసిన వారికి కూడా అవార్డు రాదని కేవలం కంటెంట్ ఉన్న సినిమాలకు మాత్రమే అవార్డు వస్తుందని వారు అభిప్రాయం చేస్తున్నారు.
కంటెంట్ ఉన్న సినిమా ను ప్రచారం చేసుకోవడం కోసం కాస్త ఖర్చు చేయాల్సిన అవసరం ఉందని.
ఆర్‌ఆర్‌ఆర్ వారు చేస్తున్నారు కనుకే అవార్డు వచ్చిందని మీడియా సర్కిల్స్ వారు కూడా మాట్లాడుకుంటున్నారు.
అక్కినేని కోడలిగా మొదటి సంక్రాంతి జరుపుకున్న … భారీ ట్రోల్స్ కి గురైన నటి!