'ఆర్ఆర్ఆర్' గ్రాండ్ ఈవెంట్స్ కన్ఫర్మ్.. ఎప్పుడెప్పుడంటే?

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమా ఆర్ఆర్ఆర్.ఈ సినిమాను టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కించాడు.

ఇందులో టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించారు.

ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుంటే.ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తున్నాడు.

ఈ సినిమాలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవగణ్ కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

డివివి దానయ్య ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.అయితే ఈ సినిమా విడుదల చేయాలనీ చూసినప్పుడల్లా ఏదొక సమస్య వస్తూనే ఉంది.

పలు వాయిదాల తర్వాత ఎట్టకేలకు ఈ సినిమా మార్చి 25న రిలీజ్ కానుందని ఇటీవలే ప్రకటించారు.

ఈ సినిమా గతంలోనే భారీ ప్రమోషన్స్ చేసిన విషయం తెలిసిందే.మళ్ళీ ఇప్పుడు ప్రమోషన్స్ కు రెడీ అవుతున్నాడు జక్కన్న.

"""/"/ ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా నుండి మరొక వార్త బయటకు వచ్చింది.

ఈ సినిమా కోసం మళ్ళీ రాజమౌళి భారీ స్కెచ్ వేస్తున్నట్టు తెలుస్తుంది.ఆర్ ఆర్ ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రంగం సిద్ధం అయ్యిందని తెలుస్తుంది.

ఈ నెల 19న గ్రాండ్ గా జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ పై ఇప్పటికే మేకర్స్ ద్రుష్టి సారించారు.

"""/"/ బుర్జ్ ఖలీఫా లో ఆర్ ఆర్ ఆర్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.

ఈ ఈవెంట్ ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించే విధంగా ఉండబోతుందని కూడా ఆసక్తికర సమాచారం బయటకు వచ్చింది.

ఈ ఈవెంట్ లో సినిమాలోని తారలంతా హాజరు కావాలని కూడా రాజమౌళి చెప్పారట.

ఇక ఈ ఈవెంట్ పూర్తి అయిన వెంటనే మార్చి 19న బెంగుళూరు లో చిక్కబళ్లాపూర్ ఒక ఈవెంట్ జరగనుందట.

వీటికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.

బరువు తగ్గాలని భావిస్తున్నారా.. అయితే వెంటనే ఇది తెలుసుకోండి!