ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా హీరోయిన్‌ మార్పుపై క్లారిటీ

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి ఏ ముహూర్తాన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాను మొదలు పెట్టాడో కాని అన్ని అడ్డంకులు అవాంతరాలే ఎదురవుతున్నాయి.

సినిమా ప్రారంభంకు ఏకంగా సంవత్సరం పట్టింది.ఆ తర్వాత షూటింగ్‌ ప్రారంభించిన జక్కన్నకు రామ్‌ చరణ్‌ గాయం షాక్‌ ఇచ్చింది.

వర్కౌట్స్‌ చేస్తూ గాయపడ్డ చరణ్‌ షూటింగ్‌ కు దూరం అవ్వడంతో అలా మొదటి లేట్‌ అయ్యింది.

ఆ తర్వాత ఎన్టీఆర్‌ విషయంలో ఆలస్యం అయ్యింది.సరే ఏదోలా సినిమాను పూర్తి చేసి జులై 30, 2020లో విడుదల చేస్తామని అన్నాడు.

కాని ఆ తర్వాత సంక్రాంతికి వాయిదా వేశాడు.జక్కన్న ఫ్యాన్స్‌ అంతా సంక్రాంతి కోసం వెయిట్‌ చేస్తున్న సమయంలో అనూహ్యంగా కరోనా వైరస్‌ కారణంగా మళ్లీ షూటింగ్‌ ఆగిపోయింది.

ఆరు నెలలుగా షూటింగ్‌ జరగడం లేదు.మరో వైపు హీరోయిన్‌ ఆలియా భట్‌ విషయంలో అనేక పుకార్లు షికారు చేస్తున్నాయి.

సుశాంత్‌ మృతితో ఆలియా భట్‌ ఉంటే సినిమాకు నెగటివ్‌ ప్రచారం జరుగుతుందని అందుకే ఆమెను తొలగించి ప్రియాంక చోప్రాను నటింపజేయాలనే నిర్ణయానికి వచ్చారంటూ వార్తలు వచ్చాయి.

"""/"/ ఇప్పటికే ఆలియాతో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిగింది.కనుక ఆమెను తొలగించడం అనేది చాలా పెద్ద ప్రహసనం అవుతుంది.

అందుకే ఆమె స్థానంలో మరొకరు అనే విషయాన్ని ఏ ఒక్కరు నమ్మడం లేదు.

ముఖ్యంగా చిత్ర యూనిట్‌ సభ్యులు ఈ విషయంలో క్లారిటీ ఇవ్వడం లేదు.కనుక ఆలియా భట్‌ స్థానంలో మరో హీరోయిన్‌ ఖచ్చితంగా ఫేక్‌ అంటున్నారు.

చిత్ర యూనిట్‌ సభ్యులు అనధికారికంగా ఈ సినిమాలో హీరోయిన్‌ మారడం లేదు అంటూ క్లారిటీ ఇస్తున్నారు.

దాంతో చర్చకు పుల్‌ స్టాప్‌ పడ్డట్లయ్యింది.

ఓటు వేయని జ్యోతిక… ఏకిపారేసిన నటి కస్తూరి శంకర్?