ఏపీలో ఆర్ఆర్ఆర్ అంత వసూలు చేయాల్సిందే.. లేకపోతే కష్టమే..

ఇప్పుడు ప్రతి ఒక్క సినీ లవర్ ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్.

ఈ సినిమా రిలీజ్ కు సర్వం సిద్ధం అయ్యింది.రేపు ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతుంది.

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ సినిమాను టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కించాడు.

ఇందులో టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించారు.

రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తుంటే.ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తున్నాడు.

అలాగే ఆలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవగణ్ కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

పలు వాయిదాల తర్వాత ఎట్టకేలకు ఈ సినిమా మార్చి 25న రిలీజ్ కానుందని ఇటీవలే ప్రకటించారు.

కాబోతుంది.మరి రిలీజ్ కు ఎన్నో గంటల సమయం కూడా లేకపోవడంతో ఈ సినిమా కోసం ఎదురు చూసే ప్రేక్షకులు మరింత ఎక్కువ అయ్యారు.

"""/" / డివివి దానయ్య ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించిన విషయం తెలిసిందే.

450 కోట్లకు పైగానే ఖర్చు చేసి మరి నిర్మించిన ఈ సినిమా 850 కోట్లకు పైగానే ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని వార్తలు బయటకు వచ్చాయి.

ఇక రేపు రిలీజ్ కాబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ విధంగా కలెక్షన్స్ రాబడుతుందో అనే చర్చ జరుగుతుంది.

ఈ సినిమా ఏపీ లో కూడా భారీ ధరకు అమ్ముడు పోయిందట.ఆంధ్ర, సీడెడ్ ఏరియాల్లో ఆర్ ఆర్ ఆర్ థియేట్రీకల్ రైట్స్ గతంలో ఎప్పుడు లేనంతగా 146 కోట్లు పలికాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

మరి ఇంత మొత్తం రాబట్టాలంటే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితేనే.

లేకపోతే బయ్యర్లు భారీ స్థాయిలో నష్టపోయే అవకాశం ఉంది.దీంతో టికెట్స్ బాగానే అమ్ముడు పోయిన బయ్యర్లు కొద్దిగా టెంషన్గా ఉన్నట్టు తెలుస్తుంది.

"""/" / అయితే ఇంతకు ముందు కంటే ఆంధ్రాలో టికెట్ రేట్స్ పెరగడం అలాగే మొదటి పది రోజులు టికెట్ 100 రూపాయలు పెంచుకోవడానికి అనుమతి ఉండడం, అదనపు షోలు వేసుకోవడానికి కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇయ్యడంతో మేకర్స్ ఈ అవకాశాన్ని వినియోగించుకుని కలెక్షన్స్ రాబట్టే ప్రయత్నాల్లో ఉన్నారు.

మరి చూడాలి ఈ సినిమా ఆంధ్రాలో ఎంత వసూలు చేస్తుందో.

ఈఫిల్ టవర్ ముందు ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ రొమాంటిక్ ప్రపోజల్.. వీడియో వైరల్..