టైటిల్ ఫిక్స్ చేసుకున్న ఆర్ఆర్ఆర్.. ఏమిటో తెలుసా?
TeluguStop.com
ప్రస్తుతం టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తున్న ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్నాడు.
ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఆర్ఆర్ఆర్‌పై క్రేజ్ ఓ రేంజ్‌లో క్రియేట్ అయ్యింది.
ఇక ఈ సినిమాను మొదట్నుండీ ఆర్ఆర్ఆర్ అనే టైటిల్‌తోనే చిత్ర యూనిట్ ప్రమోట్ చేస్తున్నా దాని పూర్తి టైటిల్‌ను మాత్రం చిత్ర యూనిట్ రివీల్ చేయలేదు.
దీంతో ఈ సినిమా టైటిల్ విషయంలో అనేక వార్తలు ఇండస్ట్రీలో వినిపించాయి.ఈ సినిమాకు రఘుపతి రాఘవ రాజారాం అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఓకే చేసినట్లు వార్తలు వచ్చాయి.
కాగా ఈ విషయంపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ మాత్రం రాలేదు.పాన్ ఇండియా మూవీగా వస్తు్న్న ఆర్ఆర్ఆర్‌ను బాలీవుడ్‌లోనూ భారీ రిలీజ్ చేస్తున్నారు.
కాగా అక్కడ ఈ సినిమా టైటిల్‌ను ‘రామ్ రావణ్ రాజ్’ అనే టైటిల్‌తో రిలీజ్ చేస్తు్న్నట్లు తెలుస్తోంది.
అక్కడ ఈ టైటిల్‌ను ఫిక్స్ చేశారట చిత్ర యూనిట్.కొమరం భీం పాత్రలో తారక్, అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ నటిస్తున్న ఈ సినిమాను డివివి దానయ్య భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు.
బాలయ్య, వెంకటేష్ ఫ్యాన్స్ ఆ విషయంలో అసంతృప్తి తో ఉన్నారా..?