మరో ప్రకటన చేసిన ఆర్ఆర్ఆర్.. ఇలా రిలీజ్ అవుతున్న ఫస్ట్ సినిమా ఇదే..

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమా ఆర్ఆర్ఆర్.ఈ సినిమాను టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కించాడు.

ఇందులో టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించారు.

ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుంటే.ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తున్నాడు.

ఈ సినిమాలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవగణ్ కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

డివివి దానయ్య ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.అయితే ఈ సినిమా విడుదల చేయాలనీ చూసినప్పుడల్లా ఏదొక సమస్య వస్తూనే ఉంది.

పలు వాయిదాల తర్వాత ఎట్టకేలకు ఈ సినిమా మార్చి 25న రిలీజ్ కానుందని ఇటీవలే ప్రకటించారు.

"""/"/ ఈ సినిమా గతంలోనే భారీ ప్రమోషన్స్ చేసిన విషయం తెలిసిందే.మళ్ళీ ఇప్పుడు ప్రమోషన్స్ కు రెడీ అవుతున్నాడు జక్కన్న.

ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా నుండి మరొక వార్త బయటకు వచ్చింది.

ఈ సినిమా ఓవర్శిస్ ఆడియెన్స్ కి మరింత అనుభూతి పంచడానికి ప్లాన్ చేస్తున్నారని మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేసారు.

ఈ సినిమా అత్యుత్తమ వ్యూ ఇచ్చే ఎక్స్ పీరియన్స్ ఇచ్చే డాల్బీ సినిమా వ్యూ తో అక్కడ రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ తెలిపారు.

"""/"/ అంతేకాదు మన ఇండియన్ సినిమా ఇలా ఎప్పుడు కూడా డాల్బీ వ్యూ తో రిలీజ్ చెయ్యలేదు.

అందుకే ఇప్పుడు మొదటి సినిమా మన తెలుగు సినిమానే అవ్వనుంది.ఈ సినిమా ఓవర్శిస్ లో మార్చి 24న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

రిలీజ్ కు ముందే ఇన్ని కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎలా ఉంటుందా అని అందరు ఎదురు చూస్తున్నారు.

తృటిలో గిన్నీస్ రికార్డుని మిస్ చేసుకున్న దర్శకుడు రేలంగి నరసింహారావు!