బుక్ మై షోలో రికార్డులు సృష్టిస్తున్న ఆర్ఆర్ఆర్!

దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా అత్యధిక భారీ బడ్జెట్ చిత్రంగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న RRR సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఇప్పటికే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది.

ఈ క్రమంలోనే ఈ సినిమాని ఈనెల 25వ తేదీన విడుదల చేయడానికి పెద్ద ఎత్తున సన్నాహాలు చేశారు.

ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు.ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, పోస్టర్లు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.

ఇక ఈ సినిమా విడుదల కాకుండానే రికార్డులు సృష్టిస్తుందని చెప్పాలి.ఈ క్రమంలోనే టికెట్ల అమ్మకానికి ముందే ఆర్ఆర్ఆర్ సినిమా సంచలన రికార్డులు సృష్టిస్తోంది.

తాజా సమాచారం ప్రకారం ఆన్‌లైన్ టిక్కెట్ పోర్టల్ అయిన బుక్ మై షోలో,ఈ సినిమా 1మిలియన్ కంటే ఎక్కువ మంది టికెట్స్ బుక్ చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది.

ఇలా టికెట్స్ అమ్మకుండానే టికెట్ల విషయంలో కూడా ఈ సినిమా రికార్డు సృష్టించడంతో ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.

"""/"/ ఇకపోతే ఈ సినిమా 25వ తేదీ విడుదల కావడంతో నేడు దుబాయ్ లో ప్రీ రిలీజ్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించనున్నారు.

ఇప్పటికే చిత్ర బృందం మొత్తం దుబాయిలో వాలిపోయారు.ఇక 19వ తేదీ ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను బెంగళూరు చిక్బల్లాపూర్ లో ఘనంగా నిర్వహించడానికి మేకర్స్ ప్లాన్ చేశారు.

ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ సీత పాత్రలో నటించారు.అలాగే అజయ్ దేవగన్, సముద్రఖని, శ్రీయ వంటి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఎన్టీఆర్, నీల్ కాంబో మూవీ బ్యాక్ డ్రాప్ ఇదేనా.. భారీ రిస్క్ కు సిద్ధమయ్యారుగా!