ఆర్‌ఆర్‌ఆర్ 50 డేస్.. నిజంగా అఖండ నే బెటర్
TeluguStop.com
టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ సినిమా 50 రోజులు పూర్తి చేసుకుంది.
ఈ సినిమా గత నెలలో విడుదల అయిన విషయం తెల్సిందే.రికార్డు స్థాయి వసూళ్లతో ఇండియాస్ బిగ్గెస్ట్ నెం.
3 సినిమా గా నిలిచిన విషయం తెల్సిందే.భారీ అంచనాల తో విడుదల అయిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ను తెలుగు ప్రేక్షకులతో పాటు అన్ని భాషల ప్రేక్షకులు కూడా సక్సెస్ చేశారు.
ఓవర్సీస్ లో దాదాపుగా వంద కోట్ల వరకు ఈ సినిమా వసూళ్లు సాధించింది అనేది టాక్.
ఇంకా మొత్తంగా ఈ సినిమా 1300 కోట్ల రూపాయలను వసూళ్లు చేసినట్లుగా సమాచారం అందుతోంది.
ఈ సినిమా నేడు 50 రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.
సినిమాకు అరుదైన రికార్డులు చాలా నమోదు అయ్యాయి.రెండు వెయ్యి కోట్ల సినిమాలను నమోదు చేసిన ఘనత రాజమౌళికి దక్కింది.
అయితే ఈ సినిమా అఖండతో పోల్చితే ఒక విషయంలో మాత్రం చాలా నిరాశ పర్చింది అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
అఖండ సినిమా 50 రోజులను ఎక్కువ సెంటర్లలో జరుపుకుంది.కాని ఆర్ ఆర్ ఆర్ సినిమా కనీసం ఒక్క చోట కూడా ఉన్నట్లుగా లేదు.
అందుకే అఖండ తో పోల్చితే ఆర్ ఆర్ ఆర్ సినిమా కు ఈ విషయం లో నిరాశ తప్పదు.
అఖండ సినిమా 50 రోజులను పూర్తి చేసుకున్న తర్వాత కూడా చాలా వరకు సినిమా ఆడింది.
ఎక్కువ థియేటర్లలో ఈ సినిమా ను 50 రోజుల వరకు ఆడలేదు అనే ఒక నిరాశ చరణ్, ఎన్టీఆర్ అభిమానుల్లో ఉంది.
అయితే వసూళ్ల విషయంలో అఖండ కంటే ఎంతో ఎత్తున ఆర్ ఆర్ ఆర్ నిలవడం కాస్త ఊరటను ఇచ్చే అంశం.