పోల‌వ‌రం నిర్వాసితుల‌కు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాల్సిందే..!

పోల‌వ‌రం నిర్వాసితుల‌కు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ చెల్లింపులపై ఏపీ హైకోర్టు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది.

ముంపు గ్రామాల ప్ర‌జ‌ల‌కు అంద‌జేస్తున్న ప్యాకేజీ చెల్లింపుల‌కు సంబంధించి దాఖ‌లైన పిటిష‌న్ పై విచార‌ణ‌ జ‌రిగింది.

పోల‌వ‌రం గ్రామాల్లో నివాసం లేర‌న్న కార‌ణంతో ప్యాకేజీ నిరాక‌రించ‌డం చ‌ట్ట విరుద్ధ‌మేన‌ని న్యాయ‌స్థానం అభిప్రాయ‌ప‌డింది.

అదేవిధంగా పిటిష‌న‌ర్ కు త‌క్ష‌ణ‌మే ప్యాకేజీ చెల్లించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

పోల‌వ‌రం ముంపు గ్రామాల‌కు చెందిన వారు ఎక్క‌డ నివాసం ఉన్నా ప్యాకేజీ ఇవ్వాల్సిందేన‌ని ధ‌ర్మాస‌నం ఉత్త‌ర్వుల్లో పేర్కొంది.

రాజకీయ ప్ర‌యోజ‌నాల‌తో ప్యాకేజీని నిరాక‌రిస్తున్నార‌ని ఆరోపిస్తూ పోల‌వరం గ్రామానికి చెందిన ఓ మ‌హిళ పిల్ దాఖ‌లు చేసిన విష‌యం తెలిసిందే.

ఇవాళ మెదక్ లో సీఎం రేవంత్ పర్యటన.. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నామినేషన్ ర్యాలీకి హాజరు