రెండు భావాలను చెప్పగలిగే తీరు సిరివెన్నెలకే సాధ్యం.. ఆర్పీ పట్నాయక్ కామెంట్స్ వైరల్!
TeluguStop.com
తెలుగు ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ ( R P Patnaik )గురించి మనందరికి తెలిసిందే.
తాజాగా ఆర్పీ పట్నాయక్ ఈటీవీ నా ఉచ్ఛ్వాసం కవనం కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు.
ఆయన శాస్త్రిగారితో తనకు ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు.తాజాగా శాస్త్రిగారి పాటల గురించి చర్చించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.శాస్త్రిగారి పాటలో సాహిత్యంపై మీ అభిప్రాయం? అన్న ప్రశ్న పై స్పందిస్తూ.
ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ.ఒక్క మాటలో చెప్పాలంటే.
శాస్త్రిగారి పాటలో సంస్కారం ఉంటుంది.సమాజంలో ఇలానే ఉండాలని కొన్ని విలువలు పెట్టుకున్నారు.
అవే విలువల్ని ఆయన పాటల్లోనూ కొనసాగించారు.ఎంత ఆస్తికుడోఅంతే నాస్తికుడు.
సందర్భానికి తగినట్లుగా పాటను మననం చేసుకుంటారు.ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ప్రశ్నించాల్సి వచ్చినప్పుడు పాటతో ప్రశ్నిస్తారు.
దేవుడిని తిట్టాల్సివస్తే నాస్తికుడిగా మారిపోయి తిడతారు.అదే పొగడాల్సి వస్తే పొగడ్తల వర్షం కురిపిస్తారు.
అందుకే ఆయన నాకు అన్నీ కలగలిపిన ఒక మనిషిలా అనిపిస్తారు.మీరు మ్యూజిక్ డైరెక్టర్, టెక్నీషియన్ కదా! మీరు పెట్టుకున్న నియమాలను పక్కనపెట్టి శాస్త్రిగారి కోసం పాడిన సందర్భాలు ఉన్నాయా? అని ప్రశ్నకు సమాదానం ఇస్తూ.
ఆయన ఒక పాటని ఎక్స్‌ట్రీమ్‌గా రాయాలనుకున్నప్పుడు.నాకు తెలిసి అది సరసం అవుతుందే తప్ప, దానిలో పెడర్థాలకు చోటు ఉండదు.
సరసం ఎంత చెప్పాలో అంతే చెబుతారు. """/" /
అది ఫ్యామిలీతో విన్నప్పటికీ చక్కగా అనిపిస్తుంది అని ఆయన తెలిపారు.
నీ స్నేహం సినిమా( Nee Sneham )లో వేయి కన్నులతో వేచి చూస్తున్నా.