రెండు భావాలను చెప్పగలిగే తీరు సిరివెన్నెలకే సాధ్యం.. ఆర్పీ పట్నాయక్ కామెంట్స్ వైరల్!

తెలుగు ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్‌ ( R P Patnaik )గురించి మనందరికి తెలిసిందే.

తాజాగా ఆర్పీ పట్నాయక్‌ ఈటీవీ నా ఉచ్ఛ్వాసం కవనం కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు.

ఆయన శాస్త్రిగారితో తనకు ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు.తాజాగా శాస్త్రిగారి పాటల గురించి చర్చించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.శాస్త్రిగారి పాటలో సాహిత్యంపై మీ అభిప్రాయం? అన్న ప్రశ్న పై స్పందిస్తూ.

ఆర్పీ పట్నాయక్‌ మాట్లాడుతూ.ఒక్క మాటలో చెప్పాలంటే.

శాస్త్రిగారి పాటలో సంస్కారం ఉంటుంది.సమాజంలో ఇలానే ఉండాలని కొన్ని విలువలు పెట్టుకున్నారు.

అవే విలువల్ని ఆయన పాటల్లోనూ కొనసాగించారు.ఎంత ఆస్తికుడోఅంతే నాస్తికుడు.

సందర్భానికి తగినట్లుగా పాటను మననం చేసుకుంటారు.ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ప్రశ్నించాల్సి వచ్చినప్పుడు పాటతో ప్రశ్నిస్తారు.

దేవుడిని తిట్టాల్సివస్తే నాస్తికుడిగా మారిపోయి తిడతారు.అదే పొగడాల్సి వస్తే పొగడ్తల వర్షం కురిపిస్తారు.

అందుకే ఆయన నాకు అన్నీ కలగలిపిన ఒక మనిషిలా అనిపిస్తారు.మీరు మ్యూజిక్‌ డైరెక్టర్‌, టెక్నీషియన్‌ కదా! మీరు పెట్టుకున్న నియమాలను పక్కనపెట్టి శాస్త్రిగారి కోసం పాడిన సందర్భాలు ఉన్నాయా? అని ప్రశ్నకు సమాదానం ఇస్తూ.

ఆయన ఒక పాటని ఎక్స్‌ట్రీమ్‌గా రాయాలనుకున్నప్పుడు.నాకు తెలిసి అది సరసం అవుతుందే తప్ప, దానిలో పెడర్థాలకు చోటు ఉండదు.

సరసం ఎంత చెప్పాలో అంతే చెబుతారు. """/" / అది ఫ్యామిలీతో విన్నప్పటికీ చక్కగా అనిపిస్తుంది అని ఆయన తెలిపారు.

నీ స్నేహం సినిమా( Nee Sneham )లో వేయి కన్నులతో వేచి చూస్తున్నా.

పాటలో మేల్‌, ఫీమేల్‌ వెర్షన్లు ఉంటాయి.భావాలు ఇద్దరికీ నప్పుతాయి.

ఈ పాటకి సంబంధించిన రెండు వెర్షన్లు సిరివెన్నెల ( Sirivennela Sitaramasastri )గారితో ఎలా రాయించారు? అని అడగగా.

కథ పరంగా కనిపించకుండా సాయం చేసే హీరో అంటే హీరోయిన్‌కి ఇష్టం.కానీ హీరో ఆమె ముందుకి రాడు.

అతని కోసం ఆ అమ్మాయి వెదుకుతుంటుంది.ఆ అబ్బాయిని నేనే అని హీరో పాడుతుంటాడు.

కానీ హీరో, హీరోయిన్‌కి కనిపించకూడదు.చూస్తే ద్వేషిస్తుందనే భయంతో తప్పించుకుని తిరుగుతాడు.

ఈ కథ మొత్తాన్ని శాస్త్రిగారు ఆ ఒక్క పాటలోనే చెప్పేశారు అని తెలిపారు ఆర్పీ పట్నాయక్‌.

"""/" / సంతోషం సినిమా మీ కెరీర్‌లో పెద్ద హిట్‌.దీనిలో నే తొలిసారిగా కలగన్నదీ నిన్నే కదా.

ఆ పాటతో మీకున్న అనుభవాలు ఏంటి? అని అడగగా ఈ పాటకి ముందు ట్యూన్‌ చేస్తే, తర్వాత లిరిక్స్‌ అందించారు సిరివెన్నెల.

దీనిలో గొప్పతనం ఏంటంటే, మ్యూజిక్‌ కంపోజ్‌ చేసిన నేను, లిరిక్స్‌ రాసిన ఆయన ఇద్దరం సగటు మహిళ హృదయాన్ని అర్థం చేసుకుని, కంపోజ్‌ చేశాం.

పాటలో ఆడతనం ఉంది కాబట్టే ఆ సాంగ్‌ని ఇప్పటికీ ఆదరిస్తున్నారు.సాహిత్యపరంగా కూడా ఒక్కొక్క అక్షరం మార్పుతో పేరులో ప్రణయమా.

తీరులో ప్రళయమా.పంతమా.

బంధమా.రెండు భావాలను చెప్పగలిగే తీరు ఆ మహానుభావుడికే సాధ్యం అని ఆయన తెలిపారు.

బిగ్ బాస్ హోస్ట్ గా తప్పుకుంటున్నాను.. స్టార్ హీరో సంచలన పోస్ట్!