బోటు బయటకు వచ్చినా మృత దేహాల జాడ లేదు
TeluguStop.com
గత నెల 15వ తారీకున తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు దగ్గర జరిగిన బోటు ప్రమాదంలో అనేక మంది మృతి చెందిన విషయం తెల్సిందే.
బోటు లోతుకు జారిపోవడంతో పలువురు గల్లంతయ్యారు.కనీసం వారి మృత దేహాలు కూడా కనిపించకుండా పోయాయి.
మృత దేహాలు కనిపించకుండా పోవడంతో చాలా మంది బోటు బయటకు తీస్తే ఆ మృత దేహాలు బయటకు వస్తాయేమో అని ఆశగా ఎదురు చూశారు.
దాదాపు నెల రోజుల పాటు బోటు బయటకు తీసేందుకు ప్రయత్నాలు కొనసాగాయి.ఎట్టకేలకు ధర్మాడి సత్యం బృందం బోటును బయటకు తీసింది.
చేసిన పలు ప్రయత్నాలు విఫలం అవుతున్నా కూడా పట్టుదలతో ఆ టీం ప్రాణాలకు తెగించి మరీ బోటను బయటకు లారు.
బోటు బయటకు లాగిన తర్వాత మూడు మృత దేహాలు కనిపించాయి.అయితే ఆ మృత దేహాలు మరీ దారుణంగా కుళ్లి పోయాయి.
అవి ఎవరి మృత దేహాలు అనే విషయాన్ని కూడా గుర్తించలేని పరిస్థితి.ఇంకా పలు మృత దేహాలు కనిపించలేదు.
కనిపించని మృత దేహాలకు సంబంధించిన బంధువులు ఇప్పటికే డెత్ సర్టిఫికెట్‌ను తీసుకున్నారు.వారికి ప్రభుత్వం 10 లక్షల ఎక్స్‌గ్రేషియా మరియు ఇన్సురెన్స్ కంపెనీ ద్వారా 10 లక్షలు వచ్చాయి.
Betway: Practical Guide To Player Safety And Responsible Gambling