ప్రియురాలికి ప్రపోజ్ చేసిన రాయల్ గార్డ్.. వీడియో వైరల్..
TeluguStop.com
బ్రిటన్ కింగ్ చార్లెస్ III( King Charles III ) జన్మదిన వేడుకలు జూన్ 15వ తేదీ శనివారం నాడు గ్రాండ్ గా జరిగాయి.
ట్రూపింగ్ ది కలర్( Trooping The Colour ) అనే వేడుకతో ఆయన పుట్టిన రోజును జరుపుకున్నారు.
ట్రూపింగ్ ది కలర్ అనేది బ్రిటన్ రాణి లేదా రాజు జన్మదినాన్ని పురస్కరించుకుని జరిగే వార్షిక వేడుక.
రాజు/రాణి నిజమైన జన్మదినానికి సంబంధం లేకుండా ప్రతి సంవత్సరం జూన్ నెల రెండవ శనివారం నాడు ఈ వేడుక జరుగుతుంది.
ఈ సంవత్సర వేడుక చాలా స్పెషల్‌గా జరిగింది.వేల్స్ యువరాణి, కేట్ మిడిల్టన్, క్యాన్సర్ బాధ నుంచి కోలుకున్న తరువాత మొదటిసారి ప్రజల ముందుకు వచ్చారు.
ఇది ఈ వేడుకకు మరింత ప్రత్యేకతను చేకూర్చింది.మరో ముఖ్య ఆకర్షణ చిన్న రాకుమారుడు లూయీ అల్లరి చేష్టలు, ప్రజలను ఎంతగానో ఆనందపరిచాయి.
"""/" /
ఈ వేడుకలో అత్యంత వైరల్‌గా మారిన క్షణాలలో ఒకటి బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో( Buckingham Palace ) జరిగిన రొమాంటిక్ ప్రపోజల్.
రాయల్ గార్డ్( Royal Guard ) తన ప్రియురాలికి ప్రపోజ్ చేశారు.ఈ హార్ట్ టచింగ్ క్షణాన్ని వీడియోలో బంధించారు.
అది వెంటనే వైరల్ అయ్యింది.రాయల్ గార్డ్స్ యునైటెడ్ కింగ్‌డమ్‌లోని అధికారిక రాజభవనాలను కాపాడే బాధ్యత కలిగి ఉంటారు.
అందుకే వారు స్ట్రిక్ట్, గంభీరమైన ప్రవర్తనకు పేరుగాంచారు.వారిలో ఒకరు విధిలో ఉండగానే తన భావాలను చాలా ఓపెన్ గా వ్యక్తపరచడం చూసి ప్రపోజల్ మరింత ప్రత్యేకంగా మారింది.
"""/" /
సోషల్ మీడియాలో ప్రపోజల్‌పై( Proposal ) విభిన్న రియాక్షన్లు వచ్చాయి.
చాలామంది జంటకు శుభాకాంక్షలు తెలిపారు, ఆ క్షణాన్ని ఎంచుకున్న దానిని పొగిడారు.కానీ, ఇంత ముఖ్యమైన వేడుకలో ప్రపోజ్ చేయడం వల్ల రాయల్ గార్డ్‌కు ఏమైనా సమస్యలు వస్తాయేమో అని కొందరు ప్రశ్నించారు.
అభిప్రాయాలు ఎలా ఉన్నా, ఈ ప్రపోజల్ వేడుకకు కొత్త ఊపు తెచ్చింది.ట్రూపింగ్ ది కలర్ వేడుకలో మరో వైరల్ వీడియో ప్రిన్స్ విలియం, కేట్‌ల చిన్న కొడుకు ప్రిన్స్ లూయీది.
మిలటరీ బ్యాండ్ మ్యూజిక్‌కి డాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో 60 లక్షలకు పైగా వ్యూస్ సాధించింది.
లూయీతో పాటు అతని అన్న, చెల్లెలు ప్రిన్స్ జార్జ్, ప్రిన్సెస్ షార్లెట్, వారి తల్లి కేట్ బాల్కనీలో కనిపించారు.
షార్లెట్ తన తమ్ముడి ఆటపాటలకి కోపంగా ఉన్నట్లు కనిపించగా, కేట్ మాత్రం కొడుకు చేష్టలకి నవ్వుకుంటున్నట్లు కనిపించింది.
మొత్తంగా ఈ సంవత్సర ట్రూపింగ్ ది కలర్ వేడుక చాలా గుర్తుండిపోయే క్షణాలతో నిండి ఉంది.
రాజ కుటుంబానికీ, ప్రజలకు కూడా ఇది ఒక ప్రత్యేకమైన వేడుకగా నిలిచింది.
చిన్నారి గుండె ఆగింది.. 8 ఏళ్లకే గుండెపోటుతో బాలిక మృతి.. స్కూల్‌లోనే విషాదం..!