మరో పవర్ స్టార్ అవుతాడు అనుకున్న విజయ్ దేవరకొండ కి ఏమైంది…
TeluguStop.com
విజయ్ దేవరకొండ( Vijay Deverakonda ) తెలుగులో మంచి హీరో గా గుర్తింపు పొందిన విషయం మనకు తెలిసిందే.
నిజనికి ఈయన ఎప్పుడో స్టార్ హీరోల లిస్ట్ లో చేరిపోవాలి కానీ ఆయన చేసిన కొన్ని అతి పనుల వల్ల ఆయనని ప్రేక్షకులు కొంతవరకు దూరం పెడుతున్నట్టు గా తెలుస్తుంది.
పెళ్లి చూపులు సినిమాతో డీసెంట్ హీరో గా పేరు తెచ్చుకున్న విజయ్ ఆ తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో టాప్ హీరో గా పేరు సంపాదించుకున్నాడు.
ఇక ఆ తర్వాత వచ్చిన గీత గోవిందం( Geetha Govindam ) కూడా బాక్స్ ఆఫీస్ వద్ద వంద కోట్ల కలక్షన్స్ ని సంపాదించాయి.
"""/" /
నిజానికి ఆయన చేసిన సిన్మాలు వరుసగా సక్సెస్ సాధించిన నేపథ్యం లో ఆయన చేసిన కొన్ని అనవసరపు కామెంట్లు ప్రేక్షకులకి విసుగు తెప్పించాయి.
ఇక అలాంటి టైం లో వచ్చిన లైగర్ సినిమా( Liger Movie ) కూడా భారీ ప్లాప్ అవ్వడం తో ఆయన మార్కెట్ ఒక్కసారి గా భారీ గా పడిపోయింది.
ఇక అందుకే ఆయన కూడా ఇక ముందు రాబోయే సినిమాల మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నట్టు గా తెలుస్తుంది.
"""/" /
అయితే ఈనెల లో రిలీజ్ కి రెడీ అవుతున్న ఖుషి సినిమా( Khushi ) మీదనే ఆయన ప్రస్తుతం చాలా అంచనాలు పెట్టుకున్నట్టు గా తెలుస్తుంది.
నిజానికి ఈ సినిమా సక్సెస్ అయితే విజయ్ మార్కెట్ భారీగా పెరుగుతుంది.
లేకపోతే ఇక కష్టమే అయితే విజయ్ పరిస్థితి చూస్తున్న ట్రేడ్ పండితులు మాత్రం విజయ్ ఒకప్పుడు తన పొగరు తో మైక్ ముందు చాలా అనవసరపు మాటలు మాట్లాడాడు లేకపోతే జనాలు ఇప్పటికీ ఆయన్ని గుండెల్లో పెట్టుకునేవారు.
ఆయన ఇండస్ట్రీ కి మరో పవన్ కళ్యాణ్ అయ్యేవాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
చూడాలి మరి ఫ్యూచర్ లో విజయ్ పవర్ స్టార్ ఇమేజ్ ని అందుకుంటాడో లేదో.