Aravind Kejriwal : కేజ్రీవాల్ అరెస్టుపై రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు రిజర్వ్
TeluguStop.com

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్( Aravind Kejriwal ) అరెస్టుపై రౌస్ అవెన్యూ కోర్టు( Rouse Avenue Court ) తీర్పును రిజర్వ్ చేసింది.


సుదీర్ఘ వాదనల అనంతరం న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది.అరెస్ట్ వ్యవహారంపై రౌస్ అవెన్యూ కోర్టులో సుమారు మూడు గంటలుగా వాదనలు కొనసాగాయి.


ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో( Delhi Liquor Scam ) కేజ్రీవాల్ కీలక సూత్రధారి అని ఈడీ పేర్కొంది.
ఈ క్రమంలోనే ఆయనను పది రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టును ఈడీ కోరింది.
మరోవైపు ఈడీ రిమాండ్ ను కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు వ్యతిరేకించారు.ఈ నేపథ్యంలో సుదీర్ధ వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.
సౌత్ ఇండియాలో నటిగా కొనసాగడం కష్టం.. జ్యోతిక సంచలన వ్యాఖ్యలు వైరల్!