సిసోడియా బెయిల్ పిటిషన్‎పై రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు రిజర్వ్..!

ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా( Manish Sisodia ) బెయిల్ పిటిషన్ పై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది.

లిక్కర్ పాలసీ సీబీఐ, ఈడీ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సిసోడియా న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది.ఈ క్రమంలోనే ఈ నెల 30న రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును వెలువరించనుంది.

అయితే లిక్కర్ కేసులో సిసోడియా ప్రధాన నిందితుడన్న సీబీఐ, ఈడీ బెయిల్ ఇవ్వొద్దని న్యాయస్థానాన్ని కోరింది.

అయిన బయటకు వస్తే ఆధారాలను, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఈడీ, సీబీఐ తెలిపింది.

అయితే ఎన్నికల ప్రచారం కోసం సిసోడియాకు అనుమతి ఇవ్వాలని ఆయన తరపు న్యాయవాదులు కోరారు.

ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.కాగా ఢిల్లీ లిక్కర్ స్కాం( Delhi Liquor Scam ) కేసులో మనీశ్ సిసోడియా అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.

ఆ పని చేసే అంత డబ్బు నా దగ్గర లేదు.. జాన్వీ కపూర్ కామెంట్స్ వైరల్!