Delhi CM Arvind Kejriwal : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు రౌస్ అవెన్యూ కోర్టు నోటీసులు
TeluguStop.com
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు( Delhi CM Arvind Kejriwal ) రౌస్ అవెన్యూ కోర్టు నోటీసులు జారీ చేసింది.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో( Delhi Excise Policy Case ) ఈ నెల 17వ తేదీన కోర్టుకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది.
మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్ తమ విచారణకు సహకరించడం లేదని ఈడీ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
"""/" /
ఈ క్రమంలో ఈడీ పిటిషన్ పై( ED Petition ) విచారణ జరిపిన న్యాయస్థానం సీఎం కేజ్రీవాల్ కు నోటీసులు జారీ చేసింది.
ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్ వ్యక్తిగతంగా ధర్మాసనం ఎదుట హాజరు కావాలని రౌస్ అవెన్యూ కోర్టు స్పష్టం చేసింది.
మద్యం కుంభకోణం కేసులో విచారణకు రావాలని కేజ్రీవాల్ కు ఈడీ అధికారులు ఐదు సార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ ఆయన గైర్హాజరు అయిన సంగతి తెలిసిందే.
రూ.100లోపే ఇల్లు కొనేసింది.. ఇప్పుడు ఆ ఇంటి లుక్కు చూస్తే ఆశ్చర్యపోతారు..