ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం

ప్రైవేట్,కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజులను నియంత్రించాలి.ఫీజుల నియంత్రణ చట్టం తెచ్చి విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాలి.

ఎస్ఎఫ్ఐ,డీవైఎఫ్ఐ,ఐద్వా,పట్నం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం.సూర్యాపేట జిల్లా:కార్పొరేట్,ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని,ఫీజుల నియంత్రణ చట్టం తెచ్చి విద్యాహక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని విద్యార్థి మరియు ప్రజా సంఘాల నాయకులు అభిప్రాయపడ్డారు.

శుక్రవారం జిల్లా కేంద్రంలోని సాక్షి శ్రీ జూనియర్ కళాశాలలో ఎస్ఎఫ్ఐ,డీవైఎఫ్ఐ,ఐద్వా పట్టణ కమిటీల ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ధనియాకుల శ్రీకాంత్ వర్మ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ పాలక వర్గాలు కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థలకు కొమ్ముకాస్తున్నారని, విద్యార్థుల దగ్గర నుండి లక్షలాది రూపాయలు ఫీజుల దోపిడీకి పాల్పడుతున్నా,చూస్తూ ఊరుకుంటున్నారని,ఫీజుల దోపిడీని అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిస్థాయిలో విఫలమైందని ఆరోపించారు.

ప్రతి పాఠశాలలో పాఠ్యపుస్తకాలు,షూ,బెల్ట్,పరీక్ష ఫీజుల పేరుమీద వేలాది రూపాయలు ముక్కుపిండి వసూలు చేస్తున్నారన్నారు.

ప్రతి సంవత్సరం 20నుండి 25 శాతం ఫీజులు పెంచుతున్న కార్పొరేట్,ప్రైవేట్ విద్యా సంస్థలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేయాలనే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వాలకు లేవన్నారు.పాఠశాలలు ప్రారంభమై సుమారు ఇరవై రోజులు కావస్తున్నా ఇంతవరకు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు యూనిఫామ్స్ అందజేయలేదని వారన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు లేక పేద బడుగు బలహీన వర్గాల చెందిన విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు.

ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేసి ప్రైవేట్,కార్పొరేట్ విద్యాసంస్థలను ప్రోత్సహించడమే ఈ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

ప్రైవేట్,కార్పొరేట్ విద్యాసంస్థలను నియంత్రించి ప్రభుత్వ విద్యాసంస్థలను అభివృద్ధి పరచకపోతే పెద్దఎత్తున రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

ఈ సమావేశంలో ఐద్వా జిల్లా కార్యదర్శి మేకనబోయిన సైదమ్మ,పట్నం జిల్లా కన్వీనర్ జె.

నరసింహారావు, డీవైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎస్కే.జహంగీర్, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి కోట గోపి,ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యుడు బానోతు వినోద్ నాయక్, పి.

డి.ఎస్.

యూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సింహాద్రి,ఎర్ర అఖిల్,మాజీ కౌన్సిలర్ ఐద్వా జిల్లా నాయకురాలు ఎలుగూరి జ్యోతి,ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి వేల్పుల వెంకన్న,జిఎంపీఎస్ జిల్లా కార్యదర్శి వీరబోయిన రవి తదితరులు పాల్గొన్నారు.

బెడ్‌రూమ్‌లో రాక్షసి ఉందనుకున్న చిన్నారి.. తీరా వెతికితే ఊహించని షాక్..?